
ఈ నేపథ్యంలో ఇప్పుడు చేసిన ప్రకటనపైనా.. కొంత అనుమానాలు ఉన్నప్పటికీ.. రెండో రోజు కూడా చంద్రబాబు ఇదే ప్రకటనను మళ్లీ మళ్లీ చెప్పడంతో అన్ని జిల్లాల్లోనూ.. యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు, నాయకులు కూడా పుంజుకుం టున్నారు. పార్టీ తరఫున ఎలాంటి పిలుపు ఇచ్చినే.. చేంసేందుకు.. ముందుకు వస్తామని యువత చెబుతున్నారు. ``పార్టీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నాను.. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేదు. ఇప్పుడు చంద్రబాబు గుర్తిస్తామని చెబుతున్నారు. కాబట్టి సంతోషంగా ఉంది. పార్టీఇ అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తులా పనిచేస్తా`` అని అనంతపురం జిల్లాకు చెందిన మైనార్టీ నేత ఒకరు చెప్పారు. ఇదే తరహా ప్రకటనలు.. అన్ని జిల్లాల నుంచి కూడా వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. మరికొందరు అయితే.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు తాము ఎంతో కష్టపడుతున్నామని.. చెబుతు న్నారు. ``యువతను ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. మంచిదే. అయినా.. చంద్రబాబును సీఎంను చేసుకునేందుకు మావం తు కృషి మాకు ఎప్పుడు ఉంటుంది`` అని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన యువత ప్రకటిస్తున్నారు. ఇక, తూర్పుగోదవరి, శ్రీకాకుళం, విజయవాడ, కర్నూలు, గుంటూరు.. ఇలా దాదాపు అన్ని జిల్లాల్లోనూ.. యువత చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.
``చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న కసి యువతలో కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం పెట్టిన కేసులకు ఎవరూ భయపడడం లేదు. మున్ముందు మరింత గా కేసులు పెరుగుతతాయి. అయినా మేం సిద్ధమే. చంద్రబాబును సీఎం ను చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో అందరూ కలిసి పనిచేస్తాం`` అని సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు. దీనిని బట్టి.. అన్ని జిల్లాల్లో చంద్రబాబు వేసిన మంత్రం బాగానే పనిచేస్తోందని అంటున్నారు సీనియర్లు కూడా.