ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీల నేతల పరిస్థితి ఏంటి అంటే వీళ్ళలో వీళ్లు తెలుగుదేశం పార్టీ కానీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాని జనసేన గాని వీళ్ళలో వీళ్లు  తిట్టుకుంటూ ఉంటారు గాని టి.ఆర్.ఎస్ ను కామెంట్ చేసే ఇది మాత్రం ఎవరికీ ఉండదు. భారతీయ జనతా పార్టీ కనుక ఏదైనా అంటే ఒకవేళ కేంద్రం నుంచి ఏదైనా దానికి సమస్య వస్తుంది అనుకోవచ్చు కానీ వీళ్ళకొచ్చిన సమస్య ఏంటి?


వీరందరూ ఆస్తులు అక్కడ ఉన్న కారణంగానా, లేదంటే కేసీఆర్ అంటే నిజంగానే అంత భయమా? హరీష్ రావు ఒక పక్కన వ్యాఖ్యలు చేస్తూ కాక రాజేస్తూ, ఎక్కువ మాట్లాడితే బాగోదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ మాట్లాడింది ఎవరు మొదట, ఆంధ్ర తెలంగాణలను పోల్చుతూ మాట్లాడింది ఎవరు? ఆంధ్ర నాయకులా లేదా హరీష్ రావా, ఒక్క కారుమూరి నాగేశ్వరావు గారి వ్యాఖ్య తప్ప కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్లు ఎవరూ దీనిపై మాట్లాడలేదు కదా.


నిన్న హరీష్ రావు కార్మికులకు సంబంధించి మాట్లాడిన దాంట్లో మీరు ఓటు హక్కును వదిలేసుకుని రండి అంటే విపక్షాలు ఒక రకంగా ఇక్కడ కొంత సంతృప్తి పడినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ బాలేదు, రోడ్లు బాలేదు అంటే అది ఇక్కడ పరిపాలన మీద ఒక రకంగా కామెంట్ చేసినట్టే కాబట్టి జగన్ పై మనతో పాటు, వాళ్లు కూడా మాట్లాడారని వాళ్లు తృప్తి పడితే పడవచ్చు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటి?


ఆంద్రాని, ఆంధ్ర కార్మికులను అవమానిస్తున్నారు. కానీ అక్కడి కార్మికులు ఇక్కడికన్నా ఎక్కువ బెనిఫిట్స్ పొందుతున్నారా, ఈ విషయం చంద్రబాబుకు తెలియదా, పవన్ కళ్యాణ్ కు తెలియదా, పోనీ వైసీపీ వాళ్లు మాట్లాడతారు అనుకుంటే వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడే ఉండడంతో దానిపై సరిగ్గా స్పందించలేకపోతున్నారని, మోడీకి ఎంత భయపడుతున్నారో వీళ్ళకి కూడా అంతే భయపడుతున్నారని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: