
అక్కడకి రామ్ చరణ్ ని పిలవడంలో ఉద్దేశం ఏమిటంటే ఆల్రెడీ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు. పాన్ వరల్డ్ స్టార్ గా కూడా మారిపోయారు. దానికి కారణం ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ దేశాలన్నిటిలోనూ ట్రాన్స్లేట్ అయ్యి రిలీజ్ అవ్వడంతో అక్కడ వాళ్ళు అందరు కూడా రామ్ చరణ్ ని ఓన్ చేసుకున్నారన్నట్లుగా తెలుస్తుంది.
ఇప్పుడు జీ20 సమావేశాల్లో పాల్గొనే దేశాల్లో చైనాను పక్కన పెడితే 19 దేశాలు. భారత్ ని, టర్కీని పక్కన పెడితే 17 దేశాలు ఉంటాయి. ఇవే కాకుండా మరో 30 దేశాలను ముఖ్య అతిథులుగా పిలిచారట. ఇన్ని దేశాలు వచ్చే ఈ జి20 సదస్సుకు రామ్ చరణ్ రావడం వల్ల అది ఆయనకి ఉపయోగమే. అలాగే ఈ జీ20 వంటి సదస్సుకు కూడా ఒక ఆకర్షణ అనేది వస్తుందని తెలుస్తుంది.
ఆ జీ20 సదస్సులో రామ్ చరణ్ కి సినిమా మీద డిబేట్లు పెట్టారట. దాంట్లో ఆయనను ప్రశ్నిస్తూ ఒక విలేకరి ఇప్పుడు కాశ్మీర్ లో ఇంత సమస్య ఉండగా ఇక్కడ జి20 సదస్సు పెట్టడం గురించి మీరు ఏమనుకుంటున్నారు అని ఆయన్ని అడిగారట. దానికి రాంచరణ్ స్పందిస్తూ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశం కాశ్మీర్ అలాంటి చోట్ల ఇలాంటి సదస్సులు పెడితే ప్రపంచ దేశాల దృష్టి దీనిపై పడుతుందని ఇది ఒక మంచి నిర్ణయం అని మోడీని రామ్ చరణ్ మెచ్చుకోవడం జరిగిందని తెలుస్తోంది.