
హరీష్ రావు గారి మాటలకు స్పందిస్తూ కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కావాలంటే "నువ్వు ఇక్కడకు రా, ఇక్కడ మా రాష్ట్రంలో ఎలా ఉందో చూపిస్తాం. దౌర్భాగ్యకరమైన స్టేట్మెంట్లు ఇవ్వద్దని ఆయన ఘాటుగా స్పందించారు. అయితే దీనికి కౌంటర్ గా మళ్లీ హరీష్ రావు స్పందించారు. కారుమూరి నాగేశ్వరరావు గారి కౌంటర్ తర్వాత, ఆ నిమిషంలోనే స్టేజిపై ఉన్న హరీష్ రావు దానికి ఘాటుగా స్పందించి మా దగ్గర రైతుబంధు ఉంది, రైతు బీమా ఉంది మీ దగ్గర ఏముంది? ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోము. తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి అని హెచ్చరించారు. ఇలా పాత తరహా ధోరణిలోనే ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది.
మొదట వ్యాఖ్య చేసింది హరీష్ రావు గారు అయినా దానికి కారుమూరి నాగేశ్వరరావు గారు ఘాటైన వ్యాఖ్యతో స్పందించేసరికి, కౌంటర్ ఇచ్చేసరికి ఆ కౌంటర్ కి వెంటనే ప్రతి కౌంటర్ గా హరీష్ రావు గారు కూడా మరింత ఘాటుగా స్పందించడం జరిగింది. ఇలాంటి బెదిరింపులు, ఆవేశాలు అగ్రహాల ద్వారా, ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదాన్ని రాజేస్తూ, తెలంగాణ ప్రజల్లో తిరిగి చైతన్యాన్ని లేదంటే వివాదాన్ని రాజేస్తున్నారా అనేటువంటిది కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు, సందేహిస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ మాటల వెనకాల ఉద్దేశం సరిగ్గా చెప్పలేం.