ఆచార్య సినిమా రిలీజ్ అయి ఒక షో ను పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన ఆచార్య సినిమా యూనిట్ కు షాక్ ఇస్తోంది అని చెప్పాలి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏ మాత్రం సంతోషంగా లేరు. కేవలం చిరంజీవి మరియు రామ్ చరణ్ ల యాక్షన్ సీన్స్, డ్యాన్స్ మినహా సినిమా ఆకట్టుకోలేదట. ఇక చిరంజీవి కెరీర్ సెకండ్ హాఫ్ లో మొదటి డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. అంతే కాకుండా రామ్ చరణ్ కు ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా హిట్ తర్వాత విడుదల అయిన సినిమా నిరాశను మిగల్చడంతో అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు. మరి ఇందులో తప్పు ఎవరిది ? కథ బలహీనతా? టేకింగ్ బాగా లేదా ? నటీనటుల ప్రదర్శనా? మ్యూజిక్ లోపమా? అన్నది చిత్ర యూనిట్ పరిశీలించుకోవాలి.

అయితే ఇక్కడ ఒక విషయం హై లైట్ అవుతోంది. తెలుగు సిద్ధాంతి వేణు స్వామి చెప్పిన జాతకం ప్రకారం రాజమౌళి జాతకంలో ఉన్న బుధుడు ప్రభావము వలన రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో అయినా సరే తన తర్వాత తీసే సినిమా ప్లాప్ అవుతుందట. అయితే ఈ విషయం ఇంతకు ముందు రానా, ప్రభాస్ ల విషయంలో రుజువు అయింది. అయితే ఇదే విషయం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి వైరల్ అవుతూ వచ్చింది. అయితే టాలీవుడ్ లో కొరటాల కు డైరెక్టర్ గా మంచి ట్రాక్ రికార్డు ఉండడంతో ఆలా జరగదు అని మెగా అభిమానులు మరియు సినిమా వర్గాలు అనుకున్నారు.

కానీ అభిమానుల అంచనాలు అన్నీ తలక్రిందులు అయ్యాయి. రాజమౌళి జాతక ప్రభావం మరో సారి పని చేసింది. ఇప్పుడు వస్తున్న రివ్యూలు అన్నీ కూడా ఆచార్యకు వ్యతిరేకంగా ఉన్నాయి. కొన్ని మీడియా చానెళ్లు మరియు థియేటర్ వద్ద ప్రేక్షకులు డిజాస్టర్ అంటున్నారు. కొరటాల కు తొలిసారి దెబ్బ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: