
అప్పటి నుండి సోషల్ మీడియా లో థమన్ పై ట్రోల్ల్స్ ఒక రేంజ్ లో రావడం ప్రారంభం అయ్యింది, ఆయన ఈ ట్రోల్స్ ధాటిని భరించలేక సోషల్ మీడియా ని వదిలి వెళ్ళిపోయాడు. అంతకు ముందు థమన్ సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉండేవాడు,ఈ విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. మరోపక్క దర్శక నిర్మాతల నుండి కూడా థమన్ పై ఒత్తిడి ఒక రేంజ్ లో పెరిగిపోయింది. కాపీ ట్యూన్స్ ఇవ్వొదంటూ ప్రాధేయపడుతున్నారు. కొంతమంది దర్శకులు అయితే థమన్ వైపు చూడకుండా తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వైపు చూస్తున్నారు. ఈయన ఇప్పటికే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' తో ప్రారంభమైన అనిరుద్ టాలీవుడ్ జర్నీ, నేడు జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' వరకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత కూడా అనిరుద్ కి టాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కినట్టు తెలుస్తుంది. థమన్ ఇలాగే కాపీ ట్యూన్స్ ఇస్తూ ఉంటే దర్శక నిర్మాతలు ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, అనిరుద్ ని తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం థమన్ పవన్ కళ్యాణ్ తో 'బ్రో ది అవతార్', రామ్ చరణ్ 'గేమ్ చేంజర్', బాలకృష్ణ 'భగవత్ కేసరి', మహేష్ బాబు 'గుంటూరు కారం',మళ్ళీ పవన్ కళ్యాణ్ తో #OG వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన 'బ్రో ది అవతార్' మూవీ మోషన్ పోస్టర్ విడుదల అయ్యింది. ఈ మోషన్ పోస్టర్ లో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్యూన్ ని ఎక్కడా కూడా కాపీ కొట్టినట్టు అనిపించలేదు. అలాగే పవన్ కళ్యాణ్ #OG చిత్రం మేకింగ్ వీడియో కి కూడా అదిరిపోయే రేంజ్ థీమ్ మ్యూజిక్ ఇచ్చాడు, ఈ మ్యూజిక్ కూడా ఎక్కడా కాపీ కొట్టినట్టుగా అనిపించలేదు.అంటే ఆయన ఇక నుండి జాగ్రత్త పడినట్టు అర్థం అవుతుంది.