సిల్క్ స్మిత ఈ పేరును  సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఆ కాలంలో సిల్క్ స్మిత తన అందచందాలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసింది, అలాగే ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందగత్తెల్లో సిల్క్ స్మిత ఒకరు.  సిల్క్ స్మిత తన మత్తు కళ్ళతో ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచుకొని అప్పటివరకు కమర్షియల్ సినిమాల ఫార్ములాకు  పూర్తిగా స్వస్తి పలికేసి తన గ్లామర్ తో అందచందాలతో  కళ్ళ కవ్వింతలతో వెండి తెరపై మ్యాజిక్ ను  క్రియేట్ చేసింది,  ఆ సమయంలో బోల్డ్ సన్నివేశాలు చేయడం పెద్ద సంచలనం. కాకపోతే సిల్క్ స్మిత మాత్రం బోల్డ్ పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్స్  లో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.

 ఇలా బోల్డ్ పాత్రలతో, ఐటమ్ సాంగ్ లతో సిల్క్ స్మిత తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది, ఇలా ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచుకున్న సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ పెద్ద మిస్టరీనే.  తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే సిల్క్ స్మిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది, తెలుగు సినిమా ఇండస్ట్రీలో సిల్క్ స్మిత మొదటి సినిమా బండి చక్రం, ఈ సినిమాలో సిల్క్ స్మిత   పోషించిన పాత్ర సిల్క్, ఆ పేరునే సిల్క్ స్మిత ఇంటి పేరుగా మార్చేసుకుంది. ఇది ఇలా ఉంటే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవటానికి అప్పట్లో ఒక సీనియర్ నటుడుతో ఆమె ప్రేమ విఫలం కావడంతో పాటు… అలానే ఆ సీనియర్ నటుడు సిల్క్ స్మిత మద్యం మత్తులో ఉండగా ఆస్తులన్నీ తన పేరు మీద రాయిం చేసుకున్నాడని… ఆ తర్వాత అతను మోసం చేయడంతో సిల్కు స్మిత డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని,  అలాగే సిల్క్ స్మిత  సంపాదించిన ఆస్తి కూడా కొన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడం ఆ తర్వాత సిల్క్ స్మిత మద్యానికి బానిస కావడంతో జీవితం చిన్నాభిన్నం అయ్యింది, సిల్క్ స్మిత చివరగా 1996 సెప్టెంబర్ 23 న తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది,  ఇలా అతి తక్కువ కాలంలోనే వెండితెరపై ఓ వెలుగు వెలిగి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే.

మరింత సమాచారం తెలుసుకోండి: