యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీఖాన్మూవీ లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ తో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇకపోతే ఈ మూవీ యూనిట్ కూడా పెద్దగా హడావిడి లేకుండా ఈ సినిమా షూటింగ్ ను చాలా సైలెంట్ గా పూర్తి చేస్తూ వస్తుంది. అప్పుడప్పుడు ఈ మూవీ కి సంబంధించిన ఏవైనా గాసిప్స్ వచ్చినా కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఈ మూవీ మేకర్స్ తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు. ఇక పోతే ఎలాంటి గాసిప్స్ రాకుండానే కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా కొరటాల శివ స్పెషల్ గా ఓ వీడియోను విడుదల చేస్తూ ... అందులో భాగంగా దేవర మూవీ ఒక అదిరిపోయే స్క్రిప్ట్ తో రూపొందుతోంది.

ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు అన్ని చాలా బలంగా ఉండబోతున్నాయి. అంత బలమైన కథను కేవలం ఒక భాగంలో చెప్పలేము. అందుకే ఈ మూవీ ని రెండు భాగాలుగా రూపొందించబోతున్నాము. అందులో భాగంగా మొదటి భాగాన్ని ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నాము అని కొరటాల ప్రకటించాడు. ఇలా కొరటాల శివమూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నాము అని ప్రకటించడంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: