
పుష్ప 2’ ఘన విజయంతో బాలీవుడ్ ఐ కాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ ల కాంబినేషన్ లో జూన్ నుండి సెట్ పైకి వెళ్ళబోతున్న సినిమాకు సంబంధించిన వార్తలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాయి. ఈమూవీలో అల్లు అర్జున్ నటించే పాత్రలో మూడు షేడ్స్ ఉంటాయి అన్న ప్రచారం జరుగుతోంది.
హీరో విలన్ యానిమేటెడ్ పాత్రలుగా మూడు డిఫరెంట్ షేడ్స్ లో బన్నీ పాత్రను అట్లీ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో జూన్ నుండి ఈమూవీ షూటింగ్ హైదరాబాద్ లో మొదలవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈసినిమా మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకునె ఎంపిక అయింది అన్న వార్తలు బాలీవుడ్ మీడియాలో వస్తున్నాయి.
ఈమెతో పాటు మరొక హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడ బన్నీ పక్కన నటించబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు మృణార్ ఠాకూర్ ఈమూవీలో ఒక కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది, బన్నీ పక్కన
ఈముగ్గురు చాలదు అన్నట్లుగా గ్లామర్ కోటింగ్ కోసం భాగ్యశ్రీ బోర్సెని కూడ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఈసినిమాలో నటించే విషయంలో తన నిర్ణయం ఇంకా పూర్తిగా దర్శక నిర్మాతలకు ఆమె చెప్పలేదు అని అంటున్నారు.
ప్యాంటసి జోనర్ లో నిర్మాణం జరుపుకోబోతున్న ఈమూవీలో అనేక ట్విస్ట్ లు ఉంటాయని అంటున్నారు. విజువల్ ఎఫెట్స్ కీలక పాత్ర పోషించే ఈమూవీలో కథ చాల వెరైటీగా ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాలో నటిస్తున్నందుకు అల్లు అర్జున్ కు 100 కోట్ల భారీ పారిశవతికంతో పాటు ఈసినిమాకు వచ్చే లాభాలలో వాటా ను కూడ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీని రాబోయే సంవత్సరం మే నెలలో విడుదలచేయాలి అన్న ప్లాన్ లో దరసకూ అట్లీ ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి..