టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాను పూర్తి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయింది. ఈ సినిమా షూటింగ్ చాలా డిలే అవుతూ ఉండడం వల్ల క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను పూర్తి చేశాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఏ ఏం రత్నం ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ ని జూలై 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన చాలా ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ ,  కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. పవన్ నటించిన మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ ఆయన అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు కర్ణాటక నుండి పెద్ద ఎత్తున కలెక్షన్స్ వస్తాయి అని చాలా మంది భావించారు. ఆ ఏరియా నుండి ఈ సినిమాకు పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావడం కాస్త కష్టం అని తెలుస్తుంది. అందుకు ప్రధాన కారణం తాజాగా కర్ణాటక ప్రభుత్వం థియేటర్ టికెట్ ధర 200 రూపాయలు దాటకూడదు అని తేల్చి చెప్పేసింది. దానితో హరిహర వీరమల్లు సినిమాకు కర్ణాటక ఏరియా నుండి పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావడం కష్టం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: