బనకచర్ల మరోసారి పెద్ద చర్చగా మారింది. తెలంగాణలో అయితే వివాదం అయ్యింది. ఇదైతే ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు కొట్టిన దెబ్బ అని చెప్పవచ్చు.. రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు(తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ,ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు) ,అలాగే రెండు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు(చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి) కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిశాక బయటకి వచ్చిన తర్వాత తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి అసలు బనకచర్ల మీద ఎలాంటి చర్చ జరగలేదని.. జరిగినటువంటి అంశం కృష్ణ బోర్డు ,గోదావరి బోర్డు గురించి మాత్రమే జరిగిందని.. కృష్ణని ఆంధ్రకి వెళ్లేటట్టు, గోదావరి ఇక్కడ ఉండేటట్టు మాట్లాడుకున్నామంటూ తెలిపారు.



అలాగే నీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం ఎలా చేసుకోవాలనే వాటి గురించి కూడా మాట్లాడుకున్నాము.. ఈ ప్రాజెక్టులకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల గురించి మాట్లాడుకున్నామని తెలిపారు. శ్రీశైలం గురించి మాట్లాడుకున్నాము అంటూ తెలియజేశారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు కూడా ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందంటూ తెలిపారు రేవంత్ రెడ్డి .బనకచర్ల గురించి అసలు ప్రస్తావనే లేదంటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం బనకచర్ల మీదన కమిటీ వేయబోతున్నారని.. ఈనెల 21వ తేదీన వివాదానికి పరిష్కారం చెప్పబోతున్నారంటూ తెలిపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎజెండలో ఫస్ట్ పాయింటే బనకచర్ల ఉండేది. ఈ విషయాన్ని హరీష్ రావు రైజ్ చేస్తూ.. రేవంత్ రెడ్డి ఎవరిని మోసం చేస్తున్నారంటూ ప్రశ్నించారు ?



ఏదైతే చంద్రబాబు, రేవంత్ ల సంబంధాన్ని అక్కడ వివాదంగా మలిచారు. చంద్రబాబు నాయుడుకి గురుదక్షిణ ఇచ్చుకుంటున్నారన్నటువంటి తరహాలో  క్రియేట్ చేసేటువంటి పని బిఆర్ఎస్ చేసింది అక్కడ. అందుకు సంబంధించి హరీష్ రావు మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది తెలంగాణ సీఎంకు పెద్ద షాకే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: