గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి రెడ్డి `జూనియర్` మూవీతో తెలుగు కన్నడ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక కాగా.. సీనియర్ బ్యూటీ జెనీలియా ముఖ్యపాత్రను పోషించింది. జూలై 18న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌ ఎంతో సందడిగా సాగింది.


అయితే జూనియర్ చిత్రంలో కిరీటి, శ్రీలీల కాంబోలో వచ్చిన‌ `వైరల్ వయ్యారి` సాంగ్ ఎంత హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తోంది. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్‌ లో చాలామంది ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. అయితే వారంతా ఒక్క ఎత్తైతే.. తాజాగా జూనియ‌ర్ ప్రీ రిలీజ్ వేడుక‌లో ఓ భామ డ్యాన్స్ చేయ‌డం మ‌రొక ఎత్తు.


ఈవెంట్ లో వైర‌ల్ వ‌య్యారి పాట‌ను ప్లే చేయ‌గా.. సీనియ‌ర్ న‌టి, బామ్మ పాత్ర‌ల‌కు కేరాఫ్ అయిన మ‌ణి లిరిక్స్ కు త‌గ్గ‌ట్టు స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ ఇర‌గ‌దీశారు. ఆమె ఎంతో ఉత్సాహంగా కాలు క‌ద‌ప‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. బామ్మ ఎన‌ర్జీకి ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. వీడియో చూసిన నెటిజ‌న్లు బామ్మ పెర్ఫార్మెన్స్ ముందు శ్రీ‌లీల కూడా వేస్టే అంటూ స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: