బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో శిల్పా శెట్టి ఒకరు. ఈమె చాలా సంవత్సరాల క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఈమె కెరియర్ మొదలు పెట్టిన కొత్త లోనే మంచి విజయాలను అందుకొని చాలా తక్కువ కాలం లోనే హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఈమె ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ బ్యూటీ తెలుగు లో కూడా పలు సినిమాలలో నటించింది. తెలుగు లో ఈమె విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందిన సాహస వీరుడు సాగర కన్య ,  మోహన్ బాబు హీరో గా రూపొందిన వీడెవడండీ బాబు , బాలకృష్ణ హీరో గా రూపొందిన భలే బాడివి బాసు , నాగార్జున హీరో గా రూపొందిన ఆజాద్ సినిమాల్లో హీరోయిన్గా నటించింది.

ఇలా ఈమె ఇప్పటివరకు తన కెరీర్లో నాలుగు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఈమెకు ఏ ఒక్క తెలుగు సినిమా ద్వారా కూడా మంచి విజయం దక్కలేదు. ఈమె వయస్సు పెరుగుతున్న అద్భుతమైన రీతిలో అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది. దానితో ఇప్పటికి కూడా ఈమె కు హిందీ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే శిల్పా శెట్టి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఈమె అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే శిల్పా శెట్టి కి ముంబై లోని బాంద్రా లో బాష్టియన్ అనే రెస్టారెంట్ ఉంది. శిల్పా శెట్టి తాజాగా బాంద్రా లో ఉన్న తన బాష్టియన్ రెస్టారెంట్ ను మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. దానితో ఈ వార్త తెగ వైరల్ అయింది. ఇలా ఈ వార్త వైరల్ కావడంతో శిల్పా శెట్టి తాజా గా ఈ న్యూస్ పై స్పందించింది. తాజాగా శిల్పా శెట్టి ఈ విషయంపై స్పందిస్తూ బాష్టియన్ రెస్టారెంట్ ను పూర్తిగా మూసి వేయడం లేదు అని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఆ రెస్టారెంట్ అసలు మూత పడదు అని ఈ ముద్దుకు క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: