
ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న అఖండ గోదావరి గురించి సమగ్ర వివరాలు :
ఈ ప్రాజెక్టు మొత్తం బడ్జెట్ సుమారు రు. 97 కోట్లు, ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేటస్్ కాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ 2024 - 25 పథకం ద్వారా చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే ప్రధాన ప్రాంతాలు రాజమహేంద్రవరం - ధదవళేశ్వరం - కడియం - కొవ్వూరు - నిడదవోలు. ప్రాజెక్టు ముఖ్య అభివృద్ధి అంశంగా హేవలాక్ బ్రిడ్జిని డవలప్ చేయనున్నారు. ఈ బ్రిడ్జికి 127 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ప్రాజెక్టులో
వాటర్‌ఫాల్స్, గ్లాస్ బ్రిడ్జి, గేమింగ్ జోన్స్, స్పేస్ థీమ్ పార్క్, హులోగ్రాం జూ, టైమ్ ‑ ట్రావెల్ అనుభవం, రైల్ మ్యూజియం, అక్వేరియం, టన్నెళ్ళు వంటి ఆధునిక ఆకర్షణలు కానున్నాయి.
పుష్కర ఘాట్ ఆధ్యాత్మిక కేంద్రంగా సుందరీకరణ చేయడం, హేవ్లాక్ బ్రిడ్జితో అనుసంధానం కూడా చేయనున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాకే తలమానికంగా ఉన్న కడియం నర్సరీలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారు. నిడదవోలు శ్రీ కోట సత్తెమ్మ దేవాలయాన్ని సంస్కరించడం, రాజగోపురం మోడర్నైజ్ చేసి భక్తుల వసతుల ఏర్పాట్లు కూడా చేయనున్నారు. పోలవరం వద్ద 2 ‑ స్టార్ హోటళ్ల నిర్మాణం, బోటు షికార్లు, టెంట్‑సిటీ ఏర్పాట్లు ఉంటాయి. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ముందు పూర్తి చేసే లక్ష్యంతో పనులు ప్రారంభిస్తున్నారు. సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో 21 ప్రధాన పుణ్యక్షేత్రాలలో భక్తుల కోసం టెంట్ నగరాలు, హోమ్‌స్టేలు ఏర్పాటు జరగనున్నాయి.
ఆయా ప్రాంతాల్లో హోంస్టే, బోటు షికార్లు, హోటల్స్ ద్వారా ఉపాధి, ఆదాయం పెంపొందించడంతో పాటు నర్సరీ, హోటల్, పార్క్‌ల ఆధునిక రూపకల్పనతో ప్రపంచాన్ని ఆకట్టుకోవడం కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు