ప్రభుత్వాలని మార్చే లేదా కూల్చే పరిస్థితుల్లో గతం అందరికీ గుర్తుకు వస్తుంటుంది. వెన్నుపోటు రాజకీయాలు అనగానే 1995 సంవత్సరం ఎన్టీఆర్,  చంద్రబాబులే కనిపిస్తారు. తిరుగుబాటు రాజకీయాలు అనగానే నాదెండ్ల భాస్కర్ రావు 1985 సంవత్సరం అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితులు రాజకీయాల్లో అరుదుగా వస్తుంటాయి. కానీ అవి ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ప్రభుత్వాలను కూల్చి తమ అధినాయకుడు ఉన్న ప్లేస్ లో తామే కూర్చోవాలని అనుకునే వారు ఒకరయితే.. నమ్మించి నట్టేట ముంచే వారు మరొకరు. ఇలా రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతుంటాయి.


ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే ఎమ్మెల్యే బయటకు వచ్చి ఏకంగా ప్రభుత్వంపై పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇది వైసీపీకి మింగుడు పడని అంశమే. గతంలో 1988 లో నెల్లూరులో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశాారు. అది చినికి చినికి గాలి వానలా మారింది. దీంతో 1989 లో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా జయకేతనం ఎగురవేసింది.


ఎమ్మెల్యేల తిరుగుబాటు అంశం ఒక్క జిల్లాతోనే పోలేదు. అంతటా దాని ప్రభావం కనిపించింది. చివరకు కాంగ్రెస్ కు అధికారాన్ని దూరం చేసింది. ప్రస్తుతం నెల్లూరు నుంచి అధికార పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురవుతోంది. సొంత ఎమ్మెల్యే రెబల్ గా మారారు. మరో నాయకుడు ఆనం తన దారి తాను చూసుకుంటున్నారు. మేకపాటి పరిస్థితి కూడా అలాగే ఉంది.


అంటే ఒక్క జిల్లాలోనే ముగ్గురు నాయకులు ఎవరి పని వారు చేసుకుంటున్నారు. దీనితో వైసీపీకి ఏమైనా నష్టం జరుగుతుందేమోనని నెల్లూరు ప్రజలతో పాటు వివిధ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతం కూడా ఇదే చెబుతోంది. నెల్లూరోళ్లతో పెట్టుకుంటే అధికారం ఊడి ప్రతిపక్షంలో కూర్చున్న ఆనాటి కాంగ్రెస్ ను అడిగితే తెలుస్తుంది అని చెప్పుకుంటున్నారు.  వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా.. లేక ఓడిపోయి కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: