
ఇటువంటి జీవో గతంలో ఉండి ఉంటే జగన్ రెడ్డి గారు నాడు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజా పక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా తమ బాధ్యత అన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇలాంటి చీకటి ఉత్త్వరులు ఇవ్వకుండానే అందులోని దురుద్దేశాలను విశాఖ నగరంలో అక్టోబరులోనే వెల్లడించారని తెలిపారు.. వాహనంలో నుంచి కనిపించకూడదని.. ప్రజలకు అభివాదం చేయకూడదని, హోటల్ నుంచి బయటకు రాకూడదని నిర్బంధాలు విధించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
అలాగే ఇప్పటం వెళ్లరాదని అటకాయించారని.. ఆ పెడ పోకడలనే అక్షరాల్లో ఉంచి జీవో ఇచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారు. ఈ ఉత్తర్వులు బూచి చూపి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకున్నారన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నానన్నారు. ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు గారు ఎమ్మెల్యేగా తన నియోజక వర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి అని గుర్తు చేశారు.
చంద్రబాబు ఆయన విధులను జీవో 1 ద్వారా అడ్డుకొంటున్నారా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ ఉత్తర్వులు జగన్ రెడ్డి గారికి వర్తిస్తాయా? లేదా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. మొన్నటి రోజున రాజమహేంద్రవరంలో జనాన్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి ఆయన చేసిన షో ఈ ఉత్తర్వుల ఉల్లంఘన పరిధిలోకి వస్తాయో రావో పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.