ఏపీలో ఈ సారి జరగబోయే  ఎన్నికలు అటు టీడీపీకి, ఇటు వైసీపీకి ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఎందుకంటే చంద్రబాబుకి దాదాపు ఆయన వయసు రీత్యా ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు. మరోవైపు జగన్ కు కూడా ఈ సారి ఎన్నికల్లో గెలుపు అంతే అవసరం. ఈ సమయంలో జగన్ రెండోసారి గెలిస్తే టీడీపీ పని అయిపోయినట్లే. తెలంగాణలో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎలా ఉందో.. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


అందుకే ఈసారి చంద్రబాబు తన శక్తినంతా కూడగట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో జనసేనతో ముందుగానే పొత్తు పెట్టుకున్నారు. తమతో పాటు బీజేపీ కూడా కలిసి రావాలని కోరకుంటున్నారు. అయితే సీఎం జగన్ అభ్యర్థులను ముందస్తుగానే ప్రకటిస్తూ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సంక్షేమం, సోషల్ ఇంజినీరింగ్ అనే రెండు అస్త్రాలతో ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.


అయితే చంద్రబాబు కూడా మూడు అస్త్రాలతో ఈ ఎన్నికలకు రెఢీ అవ్వబోతున్నారు. అవేంటంటే జగన్ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే అంతకుమించి అమలు చేస్తామని ప్రకటిస్తున్నారు. తద్వారా సంక్షేమ ప్రభుత్వాన్ని నేనే బాగా నడపగలను అని గట్టిగా చెబుతున్నారు.  ఇక రెండోది పొత్తు ధర్మం. జనసేన, టీడీపీ పొత్తు ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారు.


అందులో భాగంగా జనసేనతో కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టో, అభ్యర్థుల ఎంపికలో పవన్ తో చర్చిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మూడోది వచ్చేసరికి మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ఆశలను తీరుస్తూ.. అదే సమయంలో పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగించడం ఆయన వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. మధ్య తరగతి ప్రజలను కోటీశ్వరులు చేయడం.. పేదలను లక్షాధికారులు చేయడం తాను వస్తేనే సాధ్యం అని చెప్పి ఎన్నికలకు వెళ్తున్నారు. జగన్ ఇంటి ముందుకు తీసుకువస్తే వ్యక్తిగత అభివృద్ధి నేను చేసి చూపిస్తాను అని ప్రకటిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: