
ప్రభాస్ ఈ మూవీలో మోస్ట్ వయొలెంట్ పాత్రలో కనిపించనుండగా ప్రముఖ నటులు జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తున్నారు. భారీ మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ రిలీజ్ అప్ డేట్ పోస్టర్ నిన్న యూనిట్ రివీల్ చేసిన దగ్గరి నుండి ఒక్కసారిగా సలార్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ దీనిని భారీ స్థాయిలో ట్రెండ్ చేసారు.
తొలిసారిగా ప్రభాస్ తో కెజిఎఫ్ మూవీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీ తీస్తుండడంతో పాటు భారీ స్టార్ క్యాస్టింగ్, అలానే అత్యధిక వ్యయంతో పాటు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మితం అవుతుండడం,వంటి అంశాలు అందరిలో సలార్ పై ఈ రేంజ్ లో హైప్ కి కారణం అవుతున్నాయి. ఇక తమ మూవీ తప్పకుండా విడుదల తరువాత అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అంటోందట యూనిట్. మరి అదే కనుక జరిగితే సలార్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషినే అని చెప్పాలి. ఇక ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని,అలానే ఈ మూవీ రెండు భాగాలుగా కూడా తెరకెక్కే ఛాన్స్ ఉంది అనే వార్తలు కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. కాగా వీటిపై సలార్ యూనిట్ నుండి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.