
ఇక ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ ఉండగా అటు రాజ నర్తకి గా బాలీవుడ్ హీరోయిన్ కంగనా నటిస్తూ ఉంది. ఈ క్రమంలోనే రాఘవ లారెన్స్ తో ఇటీవల ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అదే సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది. రాఘవ లారెన్స్ తో కలిసి నటించినప్పటికీ ఇప్పటివరకు ఫోటో దిగడం కుదరలేదు అంటూ చెప్పుకొచ్చింది కంగాన. ఈరోజుతో చంద్రముఖి 2 లోని నా పాత్ర చిత్రీకరణ పూర్తయింది అని.. ఇక ఈ చిత్ర బృందానికి బై బాధగా ఉంది. అయితే కాస్ట్యూమ్స్ లోని ఎక్కువ సేపు ఉండడం వల్ల.. లారెన్స్ తో ఫోటో దిగడానికి ఇంతకాలం కుదరలేదు.. చివరి రోజు షూటింగ్ ప్రారంభం కాకముందే ఆయనను విజ్ఞప్తి చేసి ఫోటో తీసుకున్న. బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా కెరియర్ మొదలుపెట్టి కొరియోగ్రాఫర్ గా మారి ఇప్పుడు ప్రతిభతో అంచలంచలుగా ఎదుగుతున్నారు. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అంటూ కంగనా చెప్పుకొచ్చింది.
వృత్తిపరంగా మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా రాగవ లారెన్స్ గొప్ప వ్యక్తి అంటూ కంగనా ప్రశంసలు కురిపించింది. అలాంటి మంచి వ్యక్తితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక రాఘవ లారెన్స్ నుంచి ఎంతగానో స్ఫూర్తి పొందాను అంటూ కంగనా చెప్పుకొచ్చింది.