
ఈమూవీ ఎట్టి పరిస్థితులలోను హిట్ అవ్వాలి అన్న లక్ష్యంతో ఈమూవీ నిర్మాతలు ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు అనుసరిస్తున్నారు. అంతేకాదు ఈమూవీ కోసం ‘భాహుబలి’ సెంటిమెంట్ ను కూడ రంగంలోకి దించుతున్నారు.’బాహుబలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కలిసి వచ్చిన ఆ సెంటిమెంట్ ను ‘ఆదిపురుష్’ పై ప్రయోగిస్తున్నారు. ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను తిరుపతిలో జూన్ 6న అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ ఫంక్షన్ లై టెలికాస్ట్ ను కేవలం తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ ఛానల్స్ లో మాత్రమే కాకుండా తమిళ కన్నడ మళయాళ హిందీ ఛానల్స్ లో కూడ లైవ్ టెలికాస్ట్ గా ప్రసారం చేస్తారని వార్తలు వస్తున్నాయి.
ఇది చాలదు అన్నట్లుగా ఈమూవీకి సంబంధించిన రెండవ పాట విడుదల కార్యక్రమాన్ని చాల భారీగా ప్లాన్ చేసారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ‘జై శ్రీ రామ్’ పాటకు విపరీతమైన స్పందన రావడంతో దానికి కొనసాగింపుగా ‘రామ్ సియా రామ్’ అనే పాటను విడుదల చేయబోతున్నారు. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన పదాలకు సచేత్ పరంపర కంపోజ్ చేసారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్ నేషనల్ మీడియా ఇలా అన్ని వేదికల పై మే 29 మధ్యాహ్నం 12గంటలకు ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఈపాట కూడ నేటితరం వారికి బాగా నచ్చితే ‘ఆదిపురుష్’ అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఈమూవీ ప్రమోషన్ విషయంలో ఈమూవీ నిర్మాతలు అనుసరిస్తున్న కొత్త వ్యూహాలు టాప్ హీరోల సినిమాల ప్రమోషన్ కు కొత్త మార్గాన్ని చూపెట్టబోతున్నాయి..