తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే మాస్ దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందినటువంటి భద్ర మూవీ తో దర్శకుడు గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో మొదటి మూవీ తోనే బోయపాటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఈ దర్శకుడు తులసి , సింహ , దమ్ము , లెజెండ్ , సరైనోడు , జయ జానకి నాయక , వినయ విధేయ రామ , అఖండ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ ఇమేజ్ కలిగిన దర్శకుడిగా పేరును తెచ్చుకున్నాడు.

ఈ దర్శకుడు ఆఖరుగా బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా రూపొందిన అఖండ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

మూవీ ని మరి కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ను రేపటి నుండి మైసూర్ లో ఈ మూవీ యూనిట్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: