నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఫిరాయింపు ఎంపీ సుజనాచౌదరికి పెద్ద షాకిచ్చింది. తెలంగాణాలోని ఘన్ పూర్లో ఉన్న మెడిసిటి మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దుచేసేసింది. మామూలుగా కాలేజీ నిర్వహణలో ఏదైనా సమస్యలను గుర్తించి పరిష్కారం సరిచేసుకోకపోతే వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోకపోతే ఫైన్ వేస్తారు. అయితే మెడిసిటి కాలేజీకి మాత్రం ఏకంగా గుర్తింపే రద్దుచేసేశారు.





అంటే కాలేజీలో ఏస్ధాయిలో అవకతవకలు జరుగుతుంటే గుర్తింపును రద్దుచేసేసింది అనే చర్చ మొదలైంది. గుర్తింపు రద్దుచేసిన కారణంగా 2023-24 విద్యాసంవత్సరం నుండి అడ్మిషన్లు చేసేందుకు లేదని స్పష్టంగా ఆర్డర్స్ లో చెప్పేసింది. తన కాలేజీకి గుర్తింపు రద్దవుతుందని సుజనా ఊహించుండరు. 2002లో మొదలైన కాలేజీకి మొదట్లో 100 సీట్లకే అడ్మిషన్లు అనుమతిచ్చారు. తర్వాత 2017లో 150 సీట్లకు పెరిగింది. అయితే కాలేజీ నిర్వహణలో ఎక్కడ అక్రమాలు జరిగాయనే విషయం స్పష్టంగా తెలియలేదు.





కాలేజీలో 750 మంది ఎంబీబీఎస్ విద్యార్ధులు 150 మంది పీజీ విద్యార్ధులున్నారు. కాలేజీకి అనుబంధంగా టీచింగ్ ఆసుపత్రి కూడా ఉంది. ఆసుపత్రిలో 13 విభాగాలున్నాయి. ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయటం, కాలేజీతో పాటు ఆసుపత్రిలో మౌళికసదుపాయాలు ఏర్పాటుచేయటం, విద్యార్ధులకు సరిపడా అధ్యాపకులుడటం, టీచింగ్ ఆసుపత్రికి వచ్చే రోగులసంఖ్య అన్న విషయాలను నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులర్ గా తనిఖీచేస్తుంటుంది. ఎక్కడ లోపాలున్నా సవరించుకోమని వార్నింగిస్తుంది.





చాలా అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా మ్యానేజ్మెంట్ నడుచుకున్నట్లు కౌన్సిల్ గమనించింది. వార్నింగులిచ్చినా సవరించుకోకపోగా అదే ఉల్లంఘనలను కంటిన్యు చేస్తున్నట్లు గుర్తించింది. అందుకనే ఏకంగా కాలేజీ గుర్తింపునే రద్దుచేసేసింది. వచ్చేఏడాది నుండి అడ్మిషన్లు చేసేందుకు లేదంటే ఇఫుడు చదువుతున్న విద్యార్ధులదే ఆఖరు బ్యాచ్ అని అర్ధమవుతోంది. టీడీపీ తరపున రాజ్యసభ ఎంపీ అయిన సుజనా తర్వాత బీజేపీలోకి ఫిరాయించారు. సుజనాపై సీబీఐ, ఈడీ చాలా కేసులు నమోదుచేసి విచారణ జరిపింది. ఎప్పుడైతే సుజనా బీజేపీలోకి ఫిరాయించారో వెంటన దాడులు, దర్యాప్తు ఆగిపోయింది. అలాంటిది ఇపుడు తన కాలేజీ గుర్తింపే రద్దయిందంటే అందరు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: