వైఎస్ జగన్ సొంత జిల్లా కడప వేదికగా టీడీపీ మహానాడు వేడుక‌లు నేడు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ మహానాడులో మంత్రి నారా లోకేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. తొలిరోజు స‌భ‌లో ఆయ‌న స్పీచ్ తెలుగు తమ్ముళ్లను ఎంతగానో ఆకట్టుకుంది. రాష్ట్ర ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు బంగారు భవిష్యత్తును అందించే లక్ష్యంతో నారా లోకేష్ `నా తెలుగు కుటుంబం` పేరుతో ఆరు శాసనాలను ప్రతిపాదించారు.


మహానాడు వేదికగా ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌కు చినబాబు సవాల్‌ విసిరారు. ఉర్సా సంస్థకు 99 పైసలకే ఎకరా భూమి ఇచ్చినట్టు జగన్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా అంటూ మంత్రి నారా లోకేష్ ఛాలెంజ్ చేశారు. టీసీఎస్‌కు 99 పైసలకు భూములు కేటాయించాం.. కానీ వైసీపీ ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లుగా ఉర్సా కంపెనీకి అర‌వై ఎక‌రాలు అప్ప‌నంగా దార‌ద‌త్తం చేయ‌లేద‌ని, మార్కెట్ ధరకే భూములు ఇచ్చామని ఈ సందర్భంగా లోకేష్ తెలియజేశారు.



అలాగే రాష్ట్రానికి ఇక ఎన్నో పరిశ్రమలు వస్తాయి.. కానీ ఒక్కటి కూడా బయటకు పారిపోద‌ని, ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్‌ లో జగన్ వైఖరి దొంగే.. దొంగ దొంగ అన్నట్టుగా ఉందంటూ లోకేష్ సెటైర్ వేశారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని.. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తమ పార్టీ లక్ష్యమ‌ని లోకేష్ ఈ సంద‌ర్భంగా తెలియజేశారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: