
ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల సమయంలో సంచలనంగా మారిన డైలాగ్ ఒకటి ఉంది .. ఎంతో హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికల్లో వైసిపి , టిడిపి ,జనసేన ,బిజెపి పోటీపడ్డా . తర్వాత ఫలితం సంగతి అందరికీ తెలిసిందే .. అయితే ఆ ఎన్నికలు మాత్రం చరిత్రలు .చిరస్థాయిగా నిలిచిపోయాయి .. అయితే ఆ ఎన్నికల సమయంలో తన పార్టీని వైసీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒంటిచేస్తూ నడిపించారు .. ఒకేసారి అభ్యర్థులు జాబితా ప్రకటించడం నుంచి అటు కూటమి ఇటు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల సారథంలోని కాంగ్రెస్ ను గట్టిగా ఎదుర్కొన్నారు.
అయితే తెలంగాణ తరహాలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ , లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి .. అయితే అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీ అభ్యర్థులను భారీ ఎత్తున మార్చివేసింది కొందరిని వేరే జీల్లాల నుంచి తీసుకువచ్చి మరొక జిల్లాల్లో పోటీ చేయించారు .. అయితే రాజకీయాలో ఇలాంటి విన్యాసాలు సహజం .. అయితే ఆ సమయంలో వైసీపీ ప్రచారాన్ని మొత్తం తన భుజాన వేసుకున్న జగన్ ప్రతి ప్రచార మీటింగ్లోనూ వారిని ప్రజలకు పరిచయం చేశారు .. ఆ సందర్భంగా ఈ అభ్యర్థి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమంటూ చెయ్యి అలా అలా గాళ్ళు ఊపుతూ వారికి ఓటు వేయాలని ప్రజలను కోరారు .. అయితే ఇది అప్పటి ప్రచారంలో ఎంతో హైలైట్ గా మారింది .. అలాగే కొందరు ధనవంతులైన అభ్యర్థులను ఆర్థికంగా అంతంత మాత్రం అంటూ చెప్పటం పై ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి ..
అయితే ఇప్పుడు పాన్ ఇండియ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ రాజా సాబ్ .. ఇక ఇప్పుడు ఇది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు ముందుకు రానుంది .. హారర్ కామెడీ సినిమాగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది .. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ని కూడా విడుదల చేశారు . అయితే అందులో ప్రభాస్ చెప్పిన ఓ డైలాగ్ మాత్రం ఎంతగానో మెప్పించింది .. అసలు అది ఏమిటంటే .. అసలే మన పరిస్థితి అంతంత మాత్రం అని ..! అలాగే అందులో చేయినీ అలా అలా ఊపుతూ ప్రభాస్ డైలాగ్స్ చెప్పిన తీరు వైయస్ జగన్ ను ఇమిటేట్ చేసేలా ఉంది అంటు సోషల్ మీడియాలో ఆ డైలాగులు వైరల్ చేస్తున్నారు .. అయితే దర్శకుడు కు అలాంటి ఉద్దేశం ఉందో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది బాగా హాట్ టాపిక్ గా మారింది .. ప్రభాస్ , జగన్ డైలాగులను కలిపి నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు .