ఏపీ సీఎం జగన్ 50 ఏట అడుగు పెట్టబోతున్నారు. వైసీపీ ఈ వేడుకను ఘనంగా నిర్వహించబోతోంది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు సంబరాలు నిర్వహిస్తున్నారు. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు పేరిట ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. వీటిని  ఉపముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి మంత్రి రోజా  ప్రారంభించారు.


ఈ వేడుకల్లో మంత్రి ఆర్కే రోజా కళాకారులతో కలిసి కోలాటం ఆడారు. కళాకారుల వివరాలు సేకరిస్తున్నామని గతంలో ఇలాంటి ప్రక్రియ ఎప్పుడు జరగలేదని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ముఖ్యమంత్రి జగన్  50వ ఏట అడుగుపెట్టబోతున్న వేళ ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆర్కే రోజా అన్నారు. కొవిడ్ వల్ల గత రెండేళ్ళుగా చేయలేక పోయామని మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నామని మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు  అని మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివన్నారు. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయ కళలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా కళాకారులకు అండగా ఉంటామని మంత్రి ఆర్కే రోజా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: