
ఇకపోతే ఇప్పుడు ఇలా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన ఒక భారతీయుడికి ఉరిశిక్ష పడింది. అది కూడా సింగపూర్లో. 2014లో సంకరాజు సుప్పయ్య అనే 46 ఏళ్ల వ్యక్తిని గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. ఆ తర్వాత 2018 లో అక్టోబర్ 9న సింగపూర్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అక్కడ చట్టం ప్రకారం కిలో కంటే ఎక్కువ గంజాయి తరలించకూడదు. ఆ నేరాన్ని చేసినందుకు సంకరాజు సుబ్బయ్యకు మరణ శిక్ష పడింది. అయితే అతనికి మరణశిక్షను అమలు చేయరాదు అని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ రంగంలోకి దిగింది. ఇక అనేక దేశాలు మరణ శిక్షను వ్యతిరేకించాయి.
దీంతో దాదాపు ఆరు నెలలపాటు అతని మరణశిక్ష రద్దు అయ్యింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత మరోసారి ఇదే విషయంపై కోర్టులో విచారణ జరిగింది. చివరికి అతనికి మరణశిక్షను ఖరారు చేస్తూ మరోసారి అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇలా గంజాయి అక్రమంగా స్మగ్లింగ్ చేసిన వారికి మరణశిక్ష అనేది సింగపూర్ చట్టమని.. దాని విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అక్కడి హోమ్ శాఖ మంత్రి తెలిపారు. ఇక తమ దేశంలో ప్రజలు 87% మంది మరణశిక్షణణు సమర్థిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది అక్కడి ప్రభుత్వం.