
కొత్త జిల్లాల ఏర్పాటుపై కొన్ని విమర్శలుఉన్నా..త్వరలోనే అవి సర్దుమణగడం కూడా ఖాయం. దీంతో.. కొత్త జిల్లాల ఏర్పాటు ఘనతతోపాటు.. పాలనను ప్రజల వద్దకు నేరుగా తీసుకువెళ్లారనే ఖ్యాతి వైసీపీకి దక్కు తుంది. అంతేకాదు.. జిల్లాల విభజన చేసిన చరిత్రకూడా వైసీపీ ఖాతాలో పడనుంది. అయితే.. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. చంద్రబాబు హయాంలో అమరావతిని ఏర్పాటు చేశారు. ఇది అత్యం త కీలకమైన నిర్ణయం. అయితే.. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. దీనిపై యాగీ చేసి.. ఇది ఓ వర్గానికి మేలు చేసే నగరమని ప్రచారం చేసింది.
ఈ విషయంలో వైసీపీ సక్సెస్ అయిందా.. లేదా.. అనేది పక్కన పెడితే.. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ని ర్నయాన్ని మాత్రం తప్పుపట్టడం.. ప్రజల్లో చర్చకు పెట్టడం అనేది.. టీడీపీకి తీవ్ర ఇబ్బందికర పరిణా మంగా మారింది. దీని నుంచి బయట పడేందుకు కూడా పార్టీ సమస్యలు ఎదుర్కొంది. అయితే.. ఇప్పుడు జిల్లాల ఏర్పాటును వైసీపీ చేసింది. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చినా.. దీనిని యాగీ చేసే పరిస్థితి లేకుండా.. జగన్ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంది.
పైగా.. విజన్ ఉన్న నాయకుడిగా.. చంద్రబాబు ఇదే పని అప్పట్లో చేసి ఉంటే.. బాగుండేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా.. ఇప్పుడు మాత్రం బాబుకు .. కొన్ని ఇబ్బందులు తప్పవు. టీడీపీ వాళ్లు సైతం తమ ప్రభుత్వం గత ఐదేళ్లు అధికారంలో ఉండి ఈ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడంలో ఫెయిల్ అయ్యిందని అంటున్నారు.