
అయితే సేలం ర్వైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ బోగిలో ఎక్కుతున్న బిహరీలను దించేశారు తమిళులు. నిర్దాక్షిణ్యంగా పోలీసులు దించేస్తున్నతరుణంలో తీసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఉత్తరాది వలస కార్మికులపై చేసిన వీడియో ఫేక్ ది అన్నారు సీఎం స్టాలిన్. వలస కార్మికులకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. వలస కార్మికులు పేర్లు నమోదు చేసుకునేందుకు ఆన్ లైన్ లో పోర్టల్ తీసుకొచ్చామన్నారు. దక్షిణాదిలో ఎక్కువ మంది తక్కువకు పనిచేసే వారు బీహరీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు. కానీ వారిపై దాడులు చేస్తూ ప్రాంతాల వారీగా విభేదిస్తూ చూస్తున్నారు.
కానీ మన ప్రాంతంలో పెట్టిన సంక్షేమ పథకాలు పని చేయాలనుకున్న వారిని సైతం బద్దకస్తులుగా తయారు చేయాయి. ఇక్కడ పనిచేయరు చేసే వారిని చితకబాదుతూ ప్రాంతీయ బేధాల్ని చూపిస్తున్నారు. వారు కూడా భారతీయులే అన్నవిషయాన్ని మరిచిపోతున్నారు. ఏకంగా సీఎంలు చొరవ తీసుకుని ఇక్కడ గొడవ జరగలేదు. అని చెప్పారంటే అక్కడ ఎంత పెద్ద ఇష్యూ జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రాంతీయ విబేధాలను మరిచి పని చేసినపుడే ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి.
ఒక్కో ప్రాంతం విద్య పరంగా, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందితే దేశాభివృద్ధికి సాయపడుతుంది. అంతే కానీ స్వాతంత్య్రం సిద్దించి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా బీహరీలు, తమిళులు, యూపీలు అనుకుంటూ దాడులు దిగడం ఏ మాత్రం మంచిది కాదు.