థైరాయిడ్ సమస్య వల్ల ఈ మధ్యకాలంలో చాలా మంది ఇబ్బందులకు థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో గొంతు భాగంలో ఒక అవయం వంటిది..ఇది ఉత్పత్తి చేసే థైరాయిడ్ హార్మోన్లు శరీరంలోని ఉండే ఇతర అవయవాలను సరిగ్గా పని చేయడానికి చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా థైరాయిడ్ గ్రంధి ఉత్పత్తి చేసే థైరాయిడ్ హార్మోన్లు..T3,T4,TSH అంటారు ఈ హార్మోన్లు ఉత్పత్తులలో తేడా వస్తేనే దీని ప్రభావం మన శరీరం పైన చూపిస్తుందట. థైరాయిడ్ హార్మోన్ల సమస్యలను హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉత్పత్తి చేయబడినప్పుడు హైపో థైరాయిడిజం సంభవిస్తుందట.


హైపో థైరాయిడ్ సమస్య ఉంటే ముఖ్యంగా లావు అవ్వడం జరుగుతుంది.హైపర్ థైరాయిడ్ సమస్య ఉంటే చాలా చిన్నగా మారడం సంతానం లేని క్యాన్సర్ తదితర ప్రమాదకరమైన సమస్యలకు కూడా దారితీస్తుందట. అందుచేతనే థైరాయిడ్ సమస్యను ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. థైరాయిడ్ వ్యాధి గురించి ప్రజలకు అనేక అపోహలు ఉంటాయి.

థైరాయిడ్ అనేది ఏ వయసులో వారికైనా రావచ్చు కొందరికి చాలా చిన్న వయసులో వస్తే అలాగే హైపోథైరాయిడిజం అనేది స్త్రీలలో కాకుండా పురుషులలో కూడా వస్తుందట.

థైరాయిడ్ సమస్య ఉన్న వారందరికీ గాయిటర్ వస్తుందా అంటే.. అలాంటిదేమీ లేదు కేవలం కొంతమందికి మాత్రమే గొంతు ప్రాంతంలో వాపు లేదా గాయిటర్ గా వస్తుందట.

TSH సాధారణమైన తర్వాత మాత్రలను ఆపివేయవచ్చా మాత్రలు తీసుకుంటున్నప్పుడు TSH సాధారణమైనదిగా అనిపించవచ్చు. కానీ సాధారణంగా ఎక్కువ మంది రోగులు జీవితాంతం మాత్రాలను తీసుకోవలసి ఉంటుందట. ముఖ్యంగా వైద్యులు సలహా లేకుండా మాత్రలు తీసుకోవడం వంటివి ఆపకూడదట.


హైపోథైరాయిడిజం అనేది కేవలం డైట్ ద్వారా నయం కాదు.. మీరు మాత్రలు తీసుకోవాలి కానీ ఆరోగ్యకరమైన ఆహారం ఇలాంటి సమస్యను త్వరగా అదుపులోకి తీసుకురావడానికి పలు రకాల సహాయ పడుతుందట.

గొంతులో ఉండే గడ్డ క్యాన్సర్ని కలిగించదు సరైన చికిత్స తీసుకోకపోతే అది క్యాన్సర్ గా అభివృద్ధి చెందుతుందట.


చాలా థైరాయిడ్ క్యాన్సర్లను ముందుగానే గుర్తించడం వల్ల నయం చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: