
గోరువెచ్చని నీటితో స్నానం..
పీరియడ్ సమయంలో రోజుకు ఒకటికి రెండు సార్లు గోరవెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల,రిప్రెష్మెంట్ కలగడమే కాకుండా కండరాలు ఉత్తేజమై,నొప్పులన్నీ తగ్గిపోతాయి.మరియు ఋతుస్తావం అవడంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి.కావున స్త్రీలు పిరియడ్ సమయంలో రోజుకి రెండుసార్లు స్నానం చేయడం చాలా మంచిది.
కాఫీ,టీ కి దూరంగా ఉండడం..
పీరియడ్ సమయంలో చాలా మంది ఒత్తిడికి భరించలేక, కాఫీ,టీ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.కానీ ఇందులోని కెఫెన్ ఒత్తిడిని పెంచడమే కాకుండా,అధిక రక్తస్రావం అయ్యేందుకు దోహదం చేస్తుంది.కనుక కాఫీ టీలకు దూరంగా ఉండడం చాలా మంచిది.
అల్లం పెప్పర్ టీ..
కొంతమంది ఉదయం లేవగానే కాఫీ,టీలు లేకపోతే వారికి రోజు గడవదని చెప్పవచ్చు.అలాంటి వారు పీరియడ్ సమయంలో అల్లం పెప్పర్ టీ తీసుకోవడంతో ఒత్తిడిని తగ్గించడమే కాకుండా,నడుము నొప్పి,పొట్టనొప్పి నుంచి నివారణ కలిగిస్తుంది.మరియు రక్తస్రావాన్ని కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ధ్యానం చేయడం..
చాలామందికి పీరియడ్ సమయంలో పనిలో ఒత్తిడి మరియు ఆరోగ్యపరంగా సమస్యలతో చాలా విసిగిపోతూ ఉంటారు.అలాంటివారు తమకి తాము ఒక అరగంట సేపు సమయం కేటాయించుకుని ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
పడకగది చల్లగా ఉంచుకోవడం..
చాలామందికి పీరియడ్స్ సమయంలో సరైన నిద్ర కూడా కరువైపోతూ ఉంటుంది.అలాంటి వారు తమ పడకగదిని చల్లగా ఉంచుకోవడం వల్ల,సక్రమంగా నిద్ర పట్టి,అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.