
ఈ మద్య దేశంలో పాపులారిటీ సంపాదించిన వారికి సెక్యూరిటీ ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. దాంతో వారు పర్సనల్ గా బాడీ గార్డులను ఏర్పాుట చేసుకుంటున్నారు. అయితే ఈ బాడీగార్డులు తమకు ఎంత రక్షణ ఇస్తున్నా కొంత మంది మాత్రం చూసీ చూడనట్టు వారికి సామాన్య వేతనాలు ఇస్తుంటారు. మరికొంత మంది మాత్రం తమ బాడీ గార్డులను సొంత వారిలా భావిస్తుంటారు.. వారి వేతనాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటుంటాయి. సల్మాన్ ఖాన్ బాడీ గార్డు కి ప్రతి ఒక్క విషయంలో సొంత సోదరుడిగా ఆదుకుంటున్న విషయం తెలిసిందే.. మరికొంత మంది సెలబ్రెటీలు కూడా తమ బాడీగార్డు విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటుంటారు.
తాజాగా ప్రముఖ నటి దీపికా పదుకొణె తన బాడీ గార్డు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట.. అంతే కాదు అతన్ని తన సొంత సోదరుడిలా భావించి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుందట. రాఖీ పండుగకు రాఖీ కూడా కడుతుంది. తాజాగా దీపిక పదుకుణే తన బాడీగార్డ్‌కు ఎంత వేతనం చెల్లిస్తుందన్న విషయం బయటకొచ్చింది. కొన్నేళ్లుగా ఆమెకు బాడీగార్డ్‌గా జలాల్ అనే వ్యక్తి ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం ఆయనకు ఆమె ఏడాదికి రూ.80 లక్షల వేతనం ఇచ్చేది. తాజాగా ఆయనకిచ్చే వేతనాన్ని దీపిక మరింత పెంచేసింది.
ఆయన ఇప్పుడు ఏడాదికి రూ.కోటి వేతనం పొందుతున్నారు. దీపిక ఎక్కడికి వెళ్లినా ఆయన ఉండాల్సిందే. అయితే జలాల్ ఎల్ల వేలలా దీపికను అంటి పెట్టుకొనే ఉంటారట.. ఆమె హాజరైన అన్ని ఈవెంట్లలోనూ ఆయన ఉంటాడు. ఆమె ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆయన చూసుకుంటాడు. తన పర్సనల్ బాడీగార్డ్‌కు ఆమె ఇస్తోన్న వేతనాన్ని గురించి తెలుసుకుంటున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.