
రెండేళ్ళుగా సహజీవనం చేస్తున్న వీరు పెళ్ళి తర్వాత గొడవపడి వార్తల్లో నిలిచారు. అయితే అతనితో ఎప్పుడూ తరచు గొడవలు అవుతూనే ఉంటాయని చెప్పుకొచ్చారు పూనం పాండే. తన హాట్ వీడియోస్ తో కుర్రాళ్ళకు కిక్ ఎక్కించే అమ్మడు సినిమాల కన్నా ఇలా సోషల్ బ్లాగ్స్ ద్వారా.. పర్సనల్ ఆప్ ద్వారానే డబ్బు సంపాదిస్తుంది. అయితే సామ్ బాంబేతో కొన్నాళ్ళుగా కలిసి ఉంటున్న పూనం సెప్టెంబర్ 1న పెళ్ళాడారు.
పెళ్ళితో కొత్త జీవితం స్టార్ట్ చేస్తుందని భావించగా జీవితంలో కొత్త టర్న్ తీసుకున్నారు. హోటల్ యాజమాన్యం సహాయంతోనే అతని నుండి తాను సురక్షితంగా బయటపడ్డానని ఆ క్షణం తాను చనిపోతానేమో అన్న భావన వచ్చిందని అన్నారు పూనం పాండే. తనని జంతువులా ట్రీట్ చేసిన అతనితో ఇక కలిసి ఉండటం కుదరదని.. అతనితో పెళ్ళి బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు పూనం పాండే.