సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ఇంతటి స్థాయికి ఎదిగిన కూడా తన కుటుంబాన్ని మాత్రం పక్కన పెట్టలేదు. ఎప్పటికప్పుడు వారికి ఇచ్చే విలువ ఇస్తూ వారితో సమయం గడపడానికి ఎక్కువగా చూసేవాడు. అలా ఆయన మన ఊరి పాండవులు సినిమా లో నటించేటప్పుడు ఓ అరుదైన సంఘటన ఆయన పెళ్ళికి దారితీసింది. టాలీవుడ్ కమెడియన్ అల్లు రామలింగయ్య కూతురు ని మెగాస్టార్ చిరంజీవి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మన ఊరి పాండవులు సినిమా లో అల్లు రామలింగయ్య కూడా ఓ కీలక పాత్ర పోషించాడు.

అప్పుడు మెగాస్టార్ టాలెంట్ ని ఆయన పద్ధతిని గమనించి ఇలాంటి కుమారుడిని తన కూతురికి ఇస్తే బాగుంటుందని ఆలోచన కు వచ్చాడు. అనుకోవడమే ఆలస్యం చిరంజీవి తన అల్లుడు గా ఫిక్స్ అయిపోయాడు. తన భార్యకు ఈ విషయాన్ని తెలియ పరచగా ఆమె కూడా చిరు గురించి వాకబు చేసి మంచి కుర్రాడు అని మార్కులు వేసిందట. కానీ అప్పుడే చిరంజీవికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకు కారణం సుప్రీం స్టార్ గా ఎదుగుతున్న సమయం లో పెళ్లి జరిగితే కెరీర దెబ్బతింటుందని చిరంజీవి భయపడ్డారు.

కానీ అల్లు రామలింగయ్య చిరు కుటుంబానికి ధైర్యం చెప్పారు. అప్పుడు చిరు పెళ్లికి ఒప్పుకున్నారు.  అయితే పెళ్లి చూపులు సమయంలో సురేఖ చిరంజీవి లు పెద్దగా మాట్లాడలేకపోయారు. చిరు ప్రశ్నలకు సురేఖ కూడా ఇబ్బంది పడుతూనే సమాధానం ఇచ్చినట్లు గతంలో మెగాస్టార్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరి 20 న 1980వ సంవత్సరంలో అంగరంగ వైభవంగా జరిగిపోయింది. అరవింద్ కూడా చిరంజీవికి బాగా సెట్ అవడంతో ఈ ఇద్దరు ఇండస్ట్రీని ఒక్కో విభాగంలో ఏలారు. నిర్మాతగా మెగా ప్రొడ్యూసర్ గా అవతరించిన అల్లు అరవింద్ తన బావ ను మెగాస్టార్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు అని చెప్పవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: