
అయితే ఆమె గత కొన్ని నెలలుగా నే అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె అక్కడే తన పిల్లల్ని చదివించుకునే ఉద్దేశంతోనే అక్కడే ఉన్నట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించి తమ పిల్లలకు మాత్రం విదేశాల్లో చదివిస్తున్నాడు అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయంలో ట్రొల్ కూడా చేస్తున్నట్లుగా సమాచారం.
ఆయన పిల్లలకు ఏమో విదేశాలలో చదువుకోవాలి.. ఏపీ లో ఉన్న పిల్లలు మాత్రం తెలుగులోనే చదువుకోవాలా అంటూ కొంతమంది నెటిజన్లు అడుగుతున్నారు. వీరి కామెంట్లకు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తనదైన శైలిలో సమాధానాలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నడు ఇంగ్లీష్ మీడియం ని వ్యతిరేకించలేదని. తాను అలా ఏ రోజు తెలియజేయలేదని చెప్పుకొచ్చారు అభిమానులు. కేవలం ఆ పిల్లల తల్లిదండ్రుల ఇష్టానుసారంగా వారు ఏ మీడియంలో చదవాలో నిర్ణయించుకోవాలని తెలియజేశారు అంటూ ఆయన అభిమానులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.
అయితే ఇప్పటికి కూడా ఎంతో మంది ప్రముఖుల పిల్లలు కూడా విదేశాల్లోనే చదువుకుంటున్నారని, మా హీరో పిల్లలు చదివితే తప్పేముంది అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వచ్చిన ఈ రూమర్ వల్ల, ఆటు నెటిజన్లలో , అభిమానులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దీపావళి కానుక గా తన సినిమాలకు సంబంధించి అప్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది పవన్. తమ పిల్లల చదువు విషయంపై ఎలా స్పందిస్తారని విషయం తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.