
ఇంతకీ ఆ వార్త ఏమిటంటే.. కన్నడ స్టార్ యశ్, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా వస్తే ఎలా ఉంటుందని, వీరిద్దరితో కలిసి ఒక సినిమా తీయాలని నెట్టింట డిమాండ్స్ పెరుగుతున్నాయి. అయితే ఇది డిమాండ్ మాత్రమే కాదని, వాస్తవానికి ఇది జరిగే అవకాశం ఉందని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్, కేజీఎప్-2 సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. ప్రపంచవ్యాప్తంగా ఇతనికి ఫ్యాన్ ఫాలొయింగ్ పెరిగింది.
అలాగే బహుబలి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతీని పెంచి, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షక గణాన్ని పెంచుకున్నారు ప్రభాస్. ఇటీవల ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌తో సక్సెస్ అందుకున్నా.. ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అయిన ‘ఆదిపురుష్’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాను 2023లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘సలార్’ సినిమాలో నటించనున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్-యశ్ కాంబినేషన్‌లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ నటించనున్న సలార్ సినిమాలో యశ్ కూడా నటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా రేంజ్‌లో అభిమానులను సొంతం చేసుకున్న ఈ ఇద్దరు హీరోలు.. ఒకే సినిమాలో నటిస్తే బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరు స్టార్లను ఒకే తెరపై చూడటానికి ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నామని నెటిజన్లు తెలుపుతున్నారు.