మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో సుకుమార్ కి ఎలాంటి పేరు ఉందో. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైం లోనే స్టార్ డైరెక్టర్ లిస్టులోకి వెళ్లిపోయాడు.అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ఆర్య సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు సుకుమార్. ఫస్ట్ సినిమా కూడా ఇదే. అప్పట్లో ఆర్య సినిమా కొన్ని రికార్డును కొల్లగొట్టింది. అంతేకాదు సరికొత్త లవ్ స్టోరీకి నాంది పలికింది. కాగా ఆర్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్ రెండో సినిమా అనగానే జనాలలో ఓ రేంజ్ హైప్ వచ్చింది.ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పెట్టి జగడం అనే సినిమాను తెరకెక్కించాడు సుకుమార్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమా డైరెక్షన్ పరంగా ఫ్లాప్ అయినప్పటికీ ఓ సీన్ మాత్రం జనాలను బాగా ఆకట్టుకుంది . రాజమౌళిని సైతం మంత్ర ముగ్ధులను చేసింది. ఈ సీన్లో హీరో రామ్ ,అజయ్.. వెనకాల కొందరు గుండాల తో గొడవ పడుతారు. సినిమాకే ఈ సీన్ హైలైట్ గా నిలిచింది . సినిమా హిట్ అవ్వకపోయిన.. ఇప్పటికీ ఈ సీన్ ని యూట్యూబ్లో చూసే జనాలు చాలామంది ఉన్నారు.అయితే గతంలో రాజమౌళి మాట్లాడుతూ.." ఈ సినిమాలో కథ బాగా లేనప్పటికీ ..కంటెంట్ లేనప్పటికీ.. డైరెక్షన్ చెప్పుకో విధంగా లేనప్పటికీ సినిమా మొత్తానికి హైలెట్ ఆ ఒక్క ఫైటింగ్ సీన్ నే అని.. ఆ సీన్ పవన్ కళ్యాణ్ తో పడి ఉంటే ఇప్పటికి సుకుమార్ కెరియర్ మరోలా తిరిగిపోయి ఉండేదని ఓపెన్ గానే మీడియా సమావేశంలో రాజమౌళి చెప్పడం సంచలనంగా మారింది .
ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా తర్వాత సుకుమార్ ఆర్య 2, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు . అంతేకాదు పుష్పత సినిమాకు దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు మూవీ ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి: