కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి.కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. ఆ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.

నేను శైలజ చిత్రంతో Keerthy suresh టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది.

కీర్తి సురేష్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు క్యూట్ గా ఉన్నాయి. రెడ్ శారీలో కీర్తి సురేష్ చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇచ్చింది. కీర్తి సురేష్ చీరకట్టులో ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జడలో మల్లె పూలు, పెదవులపై చిరునవ్వుతో కీర్తి సురేష్ మెస్మరైజ్ చేస్తోంది.

కీర్తి సురేష్ ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటించింది. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయం దక్కించుకుంది.

సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ని పరశురామ్ అందంగా ప్రజెంట్ చేశారు. మ.. మ.. మహేషా సాంగ్ లో కీర్తి సురేష్ మాస్ స్టెప్పులతో రెచ్చిపోయింది. మహేష్ తో కలసి కామెడీ టైమింగ్ ని కూడా కీర్తి సురేష్ అద్భుతంగా పండించింది. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నట విశ్వరూపమే ప్రదర్శించింది. సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. దీనితో దర్శకులు కూడా కీర్తి సురేష్ ని గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు ఎంపిక చేసుకుంటున్నారు.

అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రాల్లో ఆమె చిరంజీవి సోదరిగా నటించబోతోంది. కీర్తి సురేష్ కి భోళా శంకర్ చిత్రం ఒక కొత్త అనుభూతి.

మరింత సమాచారం తెలుసుకోండి: