
ప్రస్తుతం ఈ సినిమాలో చంద్రముఖిగా జ్యోతిక కనబరచిన నటనకు అప్పట్లో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. గంగా అనే పాత్ర లో చాలా అమాయకంగా కనిపిస్తూనే.. చంద్రముఖి అనే భయానక పాత్రలో నటించి మెప్పించింది. ముఖ్యంగా చంద్రముఖిగా ఆమె డాన్స్ ని చూసి ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్, కళ్ళు అన్నీ కూడా చూసిన వారిని పూర్తిస్థాయిలో భయపెట్టాయని చెప్పవచ్చు. అప్పట్లో రూ. 9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది . చంద్రముఖి మలయాళం మూవీ మణి చిత్ర తాజు , అక్షయ్ కుమార్ హిందీలో భూల్ భూలయ్య గా తెరకెక్కింది..
ఈ సినిమాలు కూడా అక్కడ బాగానే ఆడి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే గత కొంతకాలంగా చంద్రముఖి సీక్వెల్ పై కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది . అయితే ఈసారి కూడా సీక్వెల్ లో జ్యోతికనే తీసుకుంటారు అని అందరూ భావించారు. కానీ దర్శకుడు వాసు మాత్రం కంగనాను ఓకే చేశారు. ప్రస్తుతం కంగానా.. రాజు గారి ఆస్థానంలో ప్రముఖ నర్తకి పాత్రలో కనిపించనుంది.. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె సరసన దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.