
ముఖ్యంగా మల్లికా సాంగ్ లో రిలీజ్ చేసిన పోస్టర్స్ లో సమంత తన అభిన్యమ, అందం తో ఆడియన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేసింది. సమంతని చూసే ఈ సినిమాకు ఆడియన్స్ వస్తారు. ఆమె ప్రధాన పాత్ర కాబట్టి తన లుక్స్ విషయంలో గుణశేఖర్ చాలా జాగ్రత్త వహించినట్టు తెలుస్తుంది. టీజర్ లో కూడా సమంత సీన్స్ బాగా వచ్చాయి.
ఇక తన మార్క్ సెట్స్.. నరేషన్ తో శాకుంతలం సినిమాను నెక్స్ట్ లెవల్లో తెరకెకించారట గుణశేఖర్. కెరీర్ లో తను వెనక్కి తగ్గిన ప్రతిసారి రెండింతలు ఉత్సాహంతో సమంత మళ్లీ వస్తుంది. శాకుంతలం సినిమా సమంత కెరీర్ కు మరింత బూస్టింగ్ ఇవ్వాలని ఆశిద్దాం. సమంత మాత్రం ఓ పక్క అనారోగ్యం తో బాధపడుతూనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. సినిమాలో సమంత నటనకు అందరు ఫిదా అవుతారని అంటున్నారు. గుణశేఖర్ లాంటి సీనియర్ డైరెక్టర్ కూడా అంతగా చెబుతున్నారు అంటే సమంత నిజంగానే బాగా చేసి ఉండొచ్చు. ఫిబ్రవరి 17న ఈ సినిమా రిలీజ్ అవుతుంది మరి సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. యశోద కు సమంత ప్రమోట్ చేయకపోయినా సేఫ్ అయ్యింది ఈ సినిమాకు సమంత ఎంతమేరకు హెల్ప్ అవుతుంది అన్నది చూడాలి.