మహేష్ బాబు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు అనంతరం.. మహేష్ నుంచి మరో ప్రాజెక్ట్ అయితే రాలేదు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీ ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుందటా.. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోండగా.. ముఖ్య పాత్రలో శ్రీలీల కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుందని సమాచారం.. ఇటీవలే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య అన్ని కమర్షియల్ హంగులున్న గా తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఈ క్రమంలోనే ఈ సినిమా లో ఓ స్పెషల్ సాంగ్ కూడా యాడ్ చేస్తున్నారని సమాచారం.అయితే మహేష్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే అప్డేట్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.

ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాను ఎంపిక చేసినట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ఈ పాట కోసం ఆమెను సంప్రదించేందుకు సిద్ధమయ్యారు చిత్రయూనిట్. ఇప్పటికే మలైకా తెలుగులో పలు స్పెషల్ సాంగ్స్ అయితే చేసింది. గతంలో మహేష్ నటించిన అతిథి చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది మలైకా. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో కూడా కనిపించింది.

ఇక తెలుగులో మలైకా చేసిన అన్ని స్పెషల్ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆడిపాడనున్నట్లుగా సమాచారం . ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్య దేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారని తెలుస్తుంది.. ఆగస్ట్ 11న ఈ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: