ఇండియాలో గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం కొంత కాలం క్రితం పాన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ మూవీ మొదటి భాగం తమిళ భాషలో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించగా ... మిగతా భాషలో మాత్రం ఆ రేంజ్ లో ప్రేక్షకులను అలరించలేకపోయింది. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగం తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచి ఇతర బాక్స్ ఆఫీస్ ల దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన రెండవ భాగం షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ రెండవ భాగాన్ని ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక పాటను విడుదల చేసింది.

అలాగే ఈ మూవీ ట్రైలర్ మరియు మ్యూజిక్ ను కూడా మార్చి 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ట్రైల‌ర్‌, ఆడియో లాంచ్‌ ను చెన్నై లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మార్చి 29 న ఈ చిత్ర బృందం జరపనుంది. మార్చి 29 సాయంత్రం 6 గంటల నుండి జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌ కి ముఖ్య అతిథి గా కమల్ హాసన్‌ రాబోతున్నాడు అని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. విక్రమ్ , కార్తీ , ఐశ్వర్య రాయ్ బచ్చన్ , జయం రవి , త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: