అల్లరి నరేష్ తాజాగా నటించిన చిత్రం ఉగ్రం ఈ సినిమా సస్పెన్స్ యాక్షన్ త్రిల్లర్గా తెరకెక్కించారు డైరెక్టర్ విజయ కనక మేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ రోజున వరల్డ్ వైడ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా క్రైమ్ విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ఆడపిల్లలు మహిళలు కనపడకుండా పోతూ ఉంటారు. ఈ మాఫియా చేసే పనులు అరికట్టేందుకు CI గా అల్లరి నరేష్ నియమించడం జరుగుతుంది.. అయితే ఇలాంటి సమయంలో తన కుటుంబం కూడా మాఫియా క్రైమ్ లో బలవుతుంది.

 ఈ శివకుమార్ ఒక భయంకరమైన నేపథం కలిగి ఉంటుంది.. ఈ శివకుమార్ ఎవరు ప్రజల అదృశ్యం వెనుక ఉన్నది ఎవరు? ఆ మాఫియాకు ఎలా చెక్ పెట్టారనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఎప్పుడు కామెడీ సినిమాలను తెరకెక్కించే అల్లరి నరేష్ ఈసారి ఒక యాక్షన్ మాస్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంతో తన పేరుపై ఇక అల్లరి నరేష్ ఉండదని చెప్పకనే చెప్పారు. గతంలో నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం వంటి తరహాలో సీరియస్ అండ్ సస్పెన్స్త్రులర్గా సాగి సినిమా కాన్సెప్ట్ కావడంతో అవన్నీ సక్సెస్ అయ్యాయి.



ఉగ్రం మూవీ సినిమా విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రంగా ఉన్నదని సస్పెన్స్ ఎలిమినేషన్స్ బాగుందని దర్శకుడు ప్రారంభంలోని సన్నివేశాలు చాలా హైపుని పెంచాయని శివకుమార్ బ్యాక్గ్రౌండ్ ఉత్కంఠంగా పరిచే ఆడియన్స్ ని కలిగించే విధంగా ఉందని తెలుపుతున్నారు. ముఖ్యంగా స్టోరీ కూడా బాగానే ఉందని దానికోసం చేసిన సెటప్ కూడా మెప్పించేలా ఉందని తెలుపుతున్నారు. అల్లరి నరేష్ ఈ సినిమాలోని పాత్రలు ఒదిగిపోయి నటించారని.. అల్లరి నరేష్ ను చూస్తే ఈ సినిమాలో కామెడీ యాంగిల్ అసలు గుర్తుకు రాదని పలువురు సినీ ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. సెకండాఫ్లు పెద్దగా ఆసక్తికరంగా లేకుండా క్రియేట్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి మంచి స్టోరీ లైన్ తో అల్లరి నరేష్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: