సినిమా పరిశ్రమలో హిట్ కాంబినేషన్లకు ఉన్న క్రేజ్ ఫ్లాప్ కాంబినేషన్లకు మాత్రం అస్సలు ఉండదు. అదే సమయంలో హీరో, హీరోయిన్, డైరెక్టర్ గత సినిమాలు ఫ్లాప్ అయితే కనుక ఆ సినిమాల బిజినెస్ పై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది.

విజయ్ దేవరకొండ, సమంత మరియు శివ నిర్వాణ కాంబినేషన్ లో ఖుషి మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అంచనాలు కూడా బాగా పెరుగుతున్నాయి.

అయితే విజయ్ దేవరకొండ గత సినిమా లైగర్ భారీ డిజాస్టర్ గా నిలిచి పూరీ జగన్నాథ్ ను అప్పుల్లో కి నెట్టేసింది.. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి పూరీ జగన్నాథ్ బయటపడాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరోవైపు గత కొన్నేళ్లుగా విజయ్ నటించిన సినిమాలన్నీ  కూడా నిరాశ పరుస్తున్నాయి. ఖుషి సినిమా విజయ్ ఫ్లాపులకు బ్రేక్ వేయాలని అభిమానులు బాగా కోరుకుంటున్నారు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు చిన్న సినిమాలు పెద్ద షాకిస్తున్నాయి.

మైత్రీ నిర్మాతలకు పెద్ద హీరోల సినిమాలు భారీ లాభాలను అందిస్తుండగా మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు అలాగే చిన్న హీరోల సినిమాలు మాత్రం షాకింగ్ ఫలితాలను అయితే మిగుల్చుతున్నాయి. సమంత గత సినిమాలలో యశోద మూవీ యావరేజ్ గా నిలవగా శాకుంతలం నష్టాలను అయితే మిగిల్చింది. వెబ్ సిరీస్ లు సక్సెస్ సాధిస్తున్నా  కూడా ఆ సక్సెస్ లతో సమంత మార్కెట్ ను అంచనా వేయడం మాత్రం సాధ్యం కాదనే విషయం తెలిసిందే.

సినిమా నిర్మాత శివ నిర్వాణ టక్ జగదీష్ సినిమాతో షాకింగ్ ఫలితాన్ని అయితే తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా గురించి క్రిటిక్స్ కూడా నెగటివ్ రివ్యూలు ఇచ్చారు.. సమంత, విజయ్ దేవరకొండ, శివ నిర్వాణలకు ఖుషి సినిమా భారీ విజయం అందిస్తుందేమో చూడాలి మరీ.. ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: