ఏం సమాజం రోజు రోజుకు దారుణంగా మారుతుంది.. పాపం అనే వారు తగ్గిపోయి.. పాపాలు చేసే వారు పెరుగుతున్నారు.. నలుగురికి అన్నం పెట్టి ఆదుకోవలసిన చేతులు చివరికి ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడటం లేదు.. ఇప్పుడు చదవబోయే ఘటన కుడా ఇలాంటిదే. నిలువ నీడలేని ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో ప్రాంగణంలో తలదాచుకుంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్‌ ఆ వృద్ధురాలిని విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.


ఆ వివరాలు చూస్తే..  ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్‌ రాణి నెహ్రూ ఆస్పత్రి ట్రామా సెంటర్‌ వెలుపల ఒక 80 ఏళ్ల వృద్ధురాలు పడుకుని ఉంది. ఇది గమనించిన అక్కద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు సంజయ్‌ మిశ్రా అకారణంగా కనికరం లేకుండా వృద్ధురాలిని కొట్టుకుంటు కాలితో తన్నాడు. ఆ దెబ్బలకు తాళలేక పాపం ఆ ముసలవ్వ సాయం కోసం కేకలు వేసింది. అక్కడ ఉన్న వారుకూడా బొమ్మలా చూస్తూ ఊరుకున్నారే తప్పితే అడ్దుపడలేదట. ఈ వ్యవహారం కాస్త ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి వెళ్లగా వృద్ధురాలిని అదే ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు.


ఇక ఇంతటి దారుణానికి ఒడిగట్టిన సదరు గార్డ్‌ సంజయ్‌ మిశ్రాను విధుల నుంచి తొలగించడమే కాక అతడి మీద కేసు నమోదు చేశారట.. అంతే కాకుండా ఇతన్ని పంపించిన ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిందట ఆస్పత్రి యాజమాన్యం. ఇక తల్లి వయస్సులో ఉన్న ఒక అనాధ వృద్దురాలిపై మానవత్వం మరచి అంత కౄరంగా ప్రవర్తించడం దారుణం. సమాజంలో ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం శోచనీయం. కాబట్తి అతడికి కఠిన శిక్ష విధించాలని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ డిమాండ్‌ చేస్తున్నారు..


అసలే కరోనా వల్ల ఎందరో నిలువ నీడ కూడ లేకుండా అనాధలుగా మారుతున్నారు.. కనీసం వారికి మంచి చేయకపోయినా పర్వాలేదు.. ఇలా మాత్రం ప్రవర్తించకండంటున్నారు మంచితనం బ్రతికించుకుంటున్న కొందరు..  


మరింత సమాచారం తెలుసుకోండి: