రాష్ట్ర విభజన అనంతరం రెండు రాషా్టల్రకు కొత్త పిసిసి అధ్యక్షులను నియమించి సార్వత్రిక ఎన్నికలలో తలపడినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వం తీవ్ర నిరాశలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు రాషా్టల్రలోనూ పార్టీ నాయకత్వ మార్పునకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ఇప్పటికే సమాలోచనలు చేసినట్లు సమాచా రం. ఈ క్రమంలోనే ఇటీవల టి పిసిసికి కొత్త సారథులను కాంగ్రెస్‌ హైకమాం డ్‌ నియమించింది. ఇప్పుడు ఏపి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డిని పార్టీ నాయకత్వ బాధ్యతల్లో కొనసాగించే విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు ఢిల్లీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తరువాత, ఇప్పటికీ ఒకోక్కరుగా కాంగ్రెస్‌ పార్టీని నేతలు వీడుతున్న విషయంలో ఏపి పిసిసి నాయకత్వంపై కాంగ్రెస్‌అధినాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోం ది. ఏపిలో పార్టీ అనుకొన్న మేరకు వేగం పుంజుకోలేదన్న భావనతో పార్టీ హైకమాండ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో పార్టీ నాయకత్వ మార్పు దిశగా అడుగులు వేయాలని కాంగ్రెస్‌ అధినాయకత్వం భావిస్తున్నట్లు ఏఐసిసి వర్గాల్లో చర్చ సాగుతోంది. త్వరలోనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పార్టీ నాయకత్వ పగ్గాలు ఎవరికి అప్పగిస్తే మేలు అన్న కోణంలో పార్టీ హైకమాండ్‌ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ కార్యక్రమాలలో ఎవరు చురుగ్గా నిర్వహిస్తున్నారు, అధికార పక్షానికి ధీటుగా ఎవరు నిలుస్తున్నారు అన్న కోణంలో కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నాయకత్వ ఎంపిక విషయంలో సామాజిక కోణానికి ప్రాధాన్యత ఇస్తూనే అవసరాల రీత్యాఅవసరమైతే తన గత విధానాన్నే అవలంభిం చాలని కూడా కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. 


 పార్టీ నాయకత్వ మార్పునకు కాంగ్రెస్‌ నాయకత్వం సమాలోచనలు చేస్తున్న నేపథ్యంలో ఏపి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డికి ఉద్వాసన పలికే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాలుపేర్కొంటున్నాయి. ఇటీవల రాహుల్‌ గాంధీ ఏపి రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిపై అధ్యయనం చేసి పార్టీ అధిష్ఠానంకు ఓ నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపిలో పార్టీ నాయకత్వ మార్పులు తప్పవన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఏఐసిసి వర్గాలు సైతం ధృవీకరిస్తున్నాయి. సమయంను బట్టి ఈ మార్పులు చేర్పులు ఉండొచ్చని వారు పేర్కొంటున్నారు. నందిగామ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అనుకొన్న మేర ఓట్లను సాధించిన విషయం తెలిసిందే. ఈ ఓట్ల శాతం బట్టి ఏపిలో పార్టీ బలపడేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాఅక్కడి పార్టీ నాయకత్వం ఆ దిశగా కార్యక్రమాలు వేగవంతం చేయలేకపోతోందన్న భావనలో కాంగ్రెస్‌ హైక మాండ్‌ ఉన్నట్లు సమాచారం. అక్కడి టిడిపి ప్రభుత్వానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌తో ధీటుగా కాంగ్రెస్‌ ఎదుర్కోలేక పోతోందన్న అంచనాకు ఆ పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలిసింది. ఏపిలో పార్టీని అన్ని వర్గాల్లో దూసుకెళ్లేలా చేయగలిగిన నేత అన్వేషణ కోసం ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. ఆఅన్వేషణ పూర్త యిన వెంటనే అక్కడ పార్టీ నాయకత్వ మార్పు లుజరగవచ్చని ఏఐసిసి పేర్కొంటు న్నాయి. 

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఎప్పుడూ కాంగ్రెస్‌పార్టీలో రెడ్డి సామా జిక వర్గానికే పెద్దపీట వేసిన సందర్భాలు ఉన్నాయి.కానీ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఏపి రాషా్టల్రలో అక్కడిప్రత్యర్థి పార్టీ లు సామాజిక నినా దం భుజాన ఎత్తుకొన్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము సామాజిక అజెండాను అనుసరించాలన్న ఉద్దేశంతో ఇరు రాషా్టల్ర పిసిసి అధ్యక్షులను బిసిలనే కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం అప్పగించింది. కానీ పార్టీ బలోపేతం దృష్టా్య ప్రస్తుతం అవకాశమున్న మేర సామాజిక కోణంను పాటించాలని భావిస్తోంది. దానివల్ల కూడా పార్టీ బలోపేతం అయ్యే పరిస్థితి లేదని అనిపిస్తే మాత్రం నాయకత్వం ఎంపికలో తనగత పంథాను అనుస రించాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఓసి వర్గాలనే పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేసి ఏపిలో పాలకపర్గాలకు ధీటుగా పార్టీని తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తున్నటు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: