యావత్ భారతావనితో పాటు,  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక రంగ మేథావులు ఎదురు చూసే క్షణం రానే వచ్చింది. భారత దేశ ఆర్థిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే సయమం దగ్గర పడింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన  బడ్జట్ ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఈ సందర్భంగా పార్లమెంట్ లో సంప్రదాయంగా జరిగే రెండు అంశాలను రద్దయ్యాయి. అవి ఏమిటంటే ?
భారత దేశ విత్తమంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీ బడ్జట్ ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. అంతే కాదు ఈ బడ్జట్ గత సంప్రదాయలకు భిన్నంగా రూపొందుతుందని కూడా ప్రభుత్వం తెలిపింది.
 భిన్నంగా ఉండే బడ్జట్ అంటే... ఇప్పటి వరకు ఆర్థిక శాఖ రూపొందించే బడ్జెట్ పత్రాలు  కిలోల కొద్దీ ఉండేటివి. వీటిని ప్రత్యేకంగా  ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లో అచ్చు వేసేవారు. అక్కడి సిబ్బందిని  బైటకు వెళ్లనీకుండా కట్టడి చేసేవారు. ఓ మాటలో చెప్పాలంటే బడ్జట్ రూపకర్తలకు, దానిని అచ్చువేసే ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి దాదాపు పక్షం రోజులు నిర్భంద ఉద్యోగ గిరి తప్పని సరి. ఈ దఫా ఆ విధానం మారుతోంది. కాగిత రహితంగా ఈ సారి బడ్జెట్ కు రూపకల్పన చేస్తోంది ప్రభుత్వం.  మంత్రి ప్రసంగ పాఠం అంతా కూడా ఆమె చట్ట సభకు వివరిస్తున్న సమయంలోనే సభ్యుల ఫోన్లకు మెసేజ్ రూపంలో చేరనుంది.
ఎన్నడూ లేని విదంగా ఈ దఫా సమావేశాలలో రాజ్యాంగం రూపొందించిన నాటి నుంచి క్రమం తప్పకుండా జురుగుతున్న రెండు విశేషాంశాలను పక్కన పెట్టింది  ప్రభుత్వం. ఆ రెండూ ఏమిటంటే జీరో అవర్, క్వశ్చన్ అవర్ . ఈ రెండింటిని కూడా  జనవరి 31,  పిబ్రవరి1 తేదీలలో రద్దు చేశారు. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి జనవరి 31వ తేదీ రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆర్థిక మంత్రి బడ్జట్ ప్రవేశ పెడతారు. దీంతో ఈ రెండు రోజులలో  శూన్యగంట, ప్రశ్నోత్తరాల సమయాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్  కార్యాలయం తెలిపింది. సభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: