ఏపీ క్యాబినెట్ మొదటి అర్ధభాగంలో కన్నా, రెండవ అర్ధభాగంలో వచ్చిన క్యాబినెట్ అద్భుతంగా ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. ఇందులో మహిళా మంత్రుల పనితీరు ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి ఆర్కే రోజా మరియు చికలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజినీలు తమదైన బాధ్యతలను సమర్థవంతంగా పోషిస్తున్నారట. ఇక జగన్ మంత్రివర్గంలో మంత్రి గా ఉన్న మరో మహిళ తానేటి వనిత కూడా దూకుడుగా లేకపోయినా పర్వాలేదు అనిపించుకుంటోంది. వీరు ముగ్గురు రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

వీరు ఇంతగా పాపులర్ అవ్వడానికి దోహదపడిన అంశాలు ఏమిటి అని చూస్తే,

వీరు తమ శాఖలకు సంబంధించిన పనులతో నిరంతరం టచ్ లో ఉండడం. ఏదైనా సమస్య వస్తే వెంటనే దానికి స్పందించి.. తగిన పరిస్కారాన్ని కనుగొంటూ ఉండడంతో మైలేజ్ బాగా వస్తోంది. ఇక ఎప్పటి లాగే ఇద్దరూ కూడా ఫైర్ బ్రాండ్ లే కాబట్టి... పార్టీని ఎవ్వరు ఏమి దూషించినా వారికి సరైన జవాబు చెప్పడంతో హై కమాండ్ దగ్గర మంచి పేరును తెచ్చుకుంటున్నారు. అయితే ఇంతా ప్రభావవంతంగా వీరు పనిచేయడానికి కారణం కూడా ఇక్కడ తెలుస్తుండడం విశేషం. ఇంతకు ముందు సరిగా పనిచేయని మంత్రులను నిర్దాక్షిణ్యంగా తొలగించడమే అని కొన్ని వర్గాల నుండి వినిపిస్తోంది. 

అందుకే జగన్ పై ఉన్న భయంతోనే తమ పనితీరులో మార్పు వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఇది మాత్రమే కాకుండా తమ నియోజకవర్గాల నుండి తమ సొంత పార్టీల నుండి విపరీతమైన పోటీ ఉండడం కూడా మరొక కారణమని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రజలకు మంచి చేస్తున్నారని కితాబు అందుతోంది. మరి ఇదే విధంగా అందరి మంత్రుల పనితీరు ఉంటే వైసీపీకి మంచి ప్లస్ అవుతుందని నిస్సందేహంగా వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అంటున్నారు. మరి ఏమి జరగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: