
టీడీపీ అధినేత చంద్రబాబు డైరక్షన్ లో రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ చచ్చిపోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని నడిపిస్తోంది చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు పార్టీ మారినప్పుడు ఈ నాయకులంతా ఏం పీకారు అంటూ మండిపడ్డారు. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే లు బయటకు పోతే ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ని అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి.
రాహుల్ గాంధీ ..సోనియా గాంధీ లను ప్రాణం పోయినా తాను విమర్శించనని అన్నారు రాజగోపాల్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ.. ఆ తర్వత కాంగ్రెస్ నాలుగో పార్టీలాగా తెలంగాణలో మిగిలిపోతోందని అన్నారు రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అసలు వ్యక్తిత్వమే లేదన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారని, ఆయన తెలంగాణ ఉద్యమంలో జైలుకి పోలేదని, అవినీతి ఆరోపణలతో జైలుకి పోయారని అన్నారు. ఆర్టీఐ కింద దరఖాస్తులు పెట్టి రేవంత్ రెడ్డి డబ్బులు వసూలు చేస్తారని అన్నారు. వ్యాపారాలు లేకుండానే రేవంత్ రెడ్డికి అన్ని కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. రాజకీయ నాయకుల ముసుగులో రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కింద ఆత్మగౌరవం చంపుకుని పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. చరిత్ర లేని మనిషి రేవంత్ రెడ్డి అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు రాజగోపాల్ రెడ్డి.