సాధారణంగా పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. ఇక ఈ మధురమైన క్షణాలన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమకు నచ్చిన విధంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అయితే ఎంతో మంది యువకులు దాంపత్య బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే కొన్ని వినూత్నమైన ఆలోచనలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు.


 ఏకంగా పెళ్లి సమయంలోనే భార్యాభర్తలు ఇద్దరు కూడా చిత్ర విచిత్రమైన ఒప్పందాలు చేసుకుంటూ ఉండడం గమనార్హం. మొన్నటికి మొన్న తమ స్నేహితుని క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని ఏకంగా పెళ్లికూతురుతో వరుడి స్నేహితులు ఒక ఒప్పందం చేసుకొని అగ్రిమెంట్ కూడా రాసుకోవడం హాట్  టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక అగ్రిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా పెళ్లి అయితే ఫ్రీడమ్ పోతుందని అందరూ అంటూ ఉంటారు.

 ఫ్రెండ్స్ తో తిరగడం లేదా లేట్ నైట్ ఇంటికి రావడం, ఇక పార్టీలు చేసుకోవడం విషయంలో భార్యలు కండిషన్స్ పెడతారని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక భర్త ఈ విషయంలో ముందు జాగ్రత్త పడ్డాడు. పెళ్లయిన తర్వాత తాను రాత్రి 9 గంటల వరకు ఫ్రెండ్స్ తో గడిపేందుకు అభ్యంతరం చెప్పకూడదని.. తరచూ ఫోన్ చేసే విసిగించకూడదని భార్యతో భర్త ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకుగాను ఏకంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా బాండ్ పేపర్ పై సైన్ చేయడం గమనార్హం. కేరళలోని పాలక్కాడ్ లో రఘు, అర్చన అనే వధూవరులు ఇలా ఒప్పందం చేసుకూన్నారు అని చెప్పాలి. ఇది చూశాక ఈ ఐడియా ఏదో బాగుంది అంటూ నేటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: