
ఔను, గత 12 టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఇషాన్ కిషన్ ఒక్కసారి కూడా 40+ స్కోరు కూడా దాటి చేయకపోవడం పలు విమర్శలకు లోనవుతున్నారు. 2022 సౌతాఫ్రికా సిరీస్‌లో 26 బంతుల్లో 27 పరుగులు చేసిన ఇషాన్ రెండో టీ20లో 7 బంతుల్లో 15 పరుగులు, ఐర్లాండ్ టూర్ తొలి టీ20లో 11 బంతుల్లో 26 పరుగులు, రెండో మ్యాచ్‌లో 5 బంతులకు కేవలం 3 పరుగులు, ఇంగ్లాండ్‌తో ఆడిన ఏకైక టీ20లో 10 బంతుల్లో 8 పరుగులు, అదే విధంగా వెస్టిండీస్ మ్యాచ్‌లో 13 బంతుల్లో 11 పరుగులు, న్యూజిలాండ్ పర్యటనలో తొలి టీ20లో 31 బంతుల్లో 36 పరుగులు, బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో డబుల్ సెంచరీ తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 29 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అయితే ఇషాన్ కిషన్ వరుసగా ఫెయిల్ అవుతున్నా, అతనికి అవకాశాలు మాత్రం ఇస్తూ వస్తోంది టీమిండియా. అందువల్లనే పలు విమర్శలు బోర్డు ఎదుర్కొంటోంది. ఇక రిషబ్ పంత్, సంజూ శాంసన్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడమే కిషన్ కి వరుస అవకాశాలు ఇస్తున్నారు అనే విమర్శలు కూడా వున్నాయి. కారణం ఏదైనా మనోడి ఆటతీరుపైన అభిమానులు సైతం పెదవి విరుస్తుండటం గమనించవచ్చు. కొంతమందైతే ఇషాన్ కిషన్‌కి వరుస అవకాశాలు ఇచ్చి, పరాజయాలు ఎదుర్కోవడం కంటే పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లను ట్రై చేయాలని డిమాండ్ చేస్తున్నారు కూడా.